శుక్రవారం, 22 నవంబరు 2024
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By selvi
Last Updated : శనివారం, 4 ఆగస్టు 2018 (17:05 IST)

సోషల్ మీడియా చీఫ్‌కే ఆ గతి.. పురుగులు, దుర్వాసనతో కూడిన ఆహారం..

రైల్వే కేటరింగ్ సరఫరా చేస్తున్న ఆహారంపై ఇఫ్పటికే పలు ఫిర్యాదులు అందుతున్నాయి. రైల్వే ఆహారంపై ఇప్పటికే వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో బీజేపీ దక్షిణ ముంబై సో

రైల్వే కేటరింగ్ సరఫరా చేస్తున్న ఆహారంపై ఇఫ్పటికే పలు ఫిర్యాదులు అందుతున్నాయి. రైల్వే ఆహారంపై ఇప్పటికే వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో బీజేపీ దక్షిణ ముంబై సోషల్ మీడియా చీఫ్ కరణ్ రాజ్ సింగ్‌కు ఈ చేదు అనుభవం ఎదురైంది. సోషల్ ఆడిట్ కార్యక్రమంలో భాగంగా కరణ్ తన అనుచరునితో కలిసి గరీబ్ రథ్ ఎక్స్ ప్రెస్‌లో ముంబై నుంచి ఢిల్లీకి బయలుదేరారు. 
 
రైల్వే కేటరింగ్ సరఫరా వ్యవహారాన్ని స్వయంగా తెలుసుకోవడం కోసం రాజ్ సింగ్ ఆహారం ఆర్డర్ చేశారు. అయితే రైలు క్యాటరింగ్ సిబ్బంది పురుగులతో దుర్వాసన వస్తున్న ఆహారాన్ని అందించడంపై కరణ్ తీవ్రంగా మండిపడ్డారు. 
 
అంతటితో ఆగకుండా.. ఈ వ్యవహారంపై మరో 30 మంది ప్రయాణికులతో కలసి కరణ్ రైల్వే మంత్రి గోయల్‌కు ట్విట్టర్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో స్పందించిన గోయల్.. ఈ ఘటనపై సమగ్ర దర్యాప్తు జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని రైల్వే అధికారుల్ని ఆదేశించారు.