మంగళవారం, 5 నవంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By pnr
Last Updated : శుక్రవారం, 6 జులై 2018 (16:35 IST)

తెరాస ఎమ్మెల్యేలు మగతనం లేనోళ్లా? ఎవరన్నారు?

తెరాస ఎమ్మెల్యేలు మగతనం లేనోళ్లా.. ఈ సందేహం భారతీయ జనతా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాంమాధవ్‌కు ఉత్పన్నమైంది. తాజాగా జరిగిన ఓ సమావేశంలో రాంమాధవ్ మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రంలో నియంత పాలన సాగుతుందని

తెరాస ఎమ్మెల్యేలు మగతనం లేనోళ్లా.. ఈ సందేహం భారతీయ జనతా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాంమాధవ్‌కు ఉత్పన్నమైంది. తాజాగా జరిగిన ఓ సమావేశంలో రాంమాధవ్ మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రంలో నియంత పాలన సాగుతుందని మండిపడ్డారు. ముఖ్యంగా, చిన్నారులకు కూడా రక్షణ లేకుండా పోయిందని ఆరోపించారు. ఓ చిన్నారికి తెరాస ఎమ్మెల్యేలు ఫోన్ చేసి బెదిరించే స్థాయికి దిగజారారని, అంటే తెరాస ఎమ్మెల్యేలు మగతనం లేనోళ్లా అంటూ మండిపడ్డారు.
 
ఈ వ్యాఖ్యలపై ఇటు తెరాస, అటు కాంగ్రెస్ పార్టీ నేతలు మండిపడుతున్నారు. ఫలితంగా తెరాస, బీజేపీ నేతల మధ్య మాటలయుద్ధం సాగుతోంది. బీజేపీ ఎమ్మెల్యేల మగతనం ఏపాటిదో గతంలో జరిగిన ఎన్నికల్లోనే తేలిపోయిందని కాంగ్రెస్ ఎమ్మెల్యే టి.జీవన్ రెడ్డి అన్నారు. టీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు రాంమాధవ్ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు.
 
బీజేపీ నేత రాంమాధవ్ సంస్కారహీనంగా మాట్లాడుతున్నారని జీవన్‌రెడ్డి విమర్శించారు. టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల మగతనం గురించి మాట్లాడటాన్ని ఖండిస్తున్నామని అన్నారు. సంఘ్‌లో పనిచేశానని చెప్పుకునే రాంమాధవ్ మాట్లాడాల్సిన భాష ఇదేనా? అంటూ ఎమ్మెల్యే ప్రశ్నించారు. తెలంగాణలో కమలం పువ్వు ఎప్పుడో వాడిపోయిందని జీవన్‌రెడ్డి ఎద్దేవా చేశారు. అలాగే,