సోమవారం, 27 జనవరి 2025
  1. వార్తలు
  2. బిజినెస్
  3. వార్తలు
Written By pnr
Last Updated : సోమవారం, 4 జూన్ 2018 (11:17 IST)

రైళ్లు ఆలస్యంగా నడిస్తే... జీఎంలకు ప్రమోషన్లు కట్ : రైల్వే మంత్రి పియూష్

దేశంలోని రైల్వే ప్రయాణికులకు ఊరట కలిగించే వార్తను కేంద్ర రైల్వే శాఖా మంత్రి పియూష్ గోయల్ చెప్పారు. ఇకపై రైళ్లు ఆలస్యంగా వస్తే సంబంధిత స్టేషన్ సిబ్బందిపై వేటు పడుతుందని ఆయన హెచ్చరించారు.

దేశంలోని రైల్వే ప్రయాణికులకు ఊరట కలిగించే వార్తను కేంద్ర రైల్వే శాఖా మంత్రి పియూష్ గోయల్ చెప్పారు. ఇకపై రైళ్లు ఆలస్యంగా వస్తే సంబంధిత స్టేషన్ సిబ్బందిపై వేటు పడుతుందని ఆయన హెచ్చరించారు.
 
దేశంలోని చాలా రైళ్లు ఆలస్యంగా నడుస్తుంటాయి. కొన్ని ఒకరోజు ఆలస్యంగా నడుస్తుంటాయి. మరికొన్ని రైళ్లు ఎపుడు వస్తాయో కూడా స్టేషన్ మేనేజర్ చెప్పలేని పరిస్థితి ఉంది. దీనిపై పెద్ద ఎత్తున ఫిర్యాదులు వచ్చాయి. దీంతో రైల్వే అధికారులపై రైల్వే మంత్రి ఆగ్రహం వ్యక్తంచేశారు. 
 
ఇదే అంశంపై ఆయన రైల్వే శాఖ ఉన్నతాధికారులతో ఒక సమీక్షా సమావేశం నిర్వహించారు. ఇందులో ఆయన మాట్లాడుతూ, సరైన సమయానికి రైళ్లు నడపి రైల్వేశాఖ చిత్తశుద్ధిని ప్రజలకు తెలియజేయాలన్నారు. ఈనెలాఖరులోపు పరిస్థితిని చక్కదిద్దాలని లేనిపక్షంలో రైల్వే స్టేషన్ల జీఎంలకు ప్రమోషన్లు ఇవ్వమని, కఠిన చర్యలకు వెనకాడబోమని గోయల్ తెలిపారు.