ఆదివారం, 12 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By TJ
Last Modified: మంగళవారం, 22 మే 2018 (20:59 IST)

స్వీట్ వార్నింగ్ ఇచ్చిన రష్మి.. ఎవరికో తెలుసా?

జబర్దస్త్‌తో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది రష్మి. బుల్లితెరతో పాటు కొన్ని ఈవెంట్స్ కూడా ప్రస్తుతం చేస్తోంది. అంతేకాదు ఎపి, తెలంగాణా రాష్ట్రాల్లో తిరుగుతూ కల్చరల్ ఈవెంట్స్‌లో కూడా చురుగ్గా పాల్గొంటోంది. సాధారణ యాంకర్ల కన్నా డబ్బులను చాలా ఎ

జబర్దస్త్‌తో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది రష్మి. బుల్లితెరతో పాటు కొన్ని ఈవెంట్స్ కూడా ప్రస్తుతం చేస్తోంది. అంతేకాదు ఎపి, తెలంగాణా రాష్ట్రాల్లో తిరుగుతూ కల్చరల్ ఈవెంట్స్‌లో కూడా చురుగ్గా పాల్గొంటోంది. సాధారణ యాంకర్ల కన్నా డబ్బులను చాలా ఎక్కువగానే తీసుకుంటోందట రష్మి. అయితే ఈ మధ్య రష్మికి బాగా కోపమొచ్చింది. 
 
అసలు రష్మికి కోపమెందుకు వచ్చిందంటే, అమెరికాలోని తెలుగు సంస్థ నాటా తనను సంప్రదించకుండానే తన పేరు ఒక ఈవెంట్‌లో వేసేసిందట. పేరు కాదు ఫోటోలు కూడా వేసి రష్మితో పాటు ప్రభాస్, శ్రీనువైట్ల వస్తున్నట్లు ప్రచారం చేసిందట. దీంతో టిక్కెట్లు బాగానే అమ్ముడుపోయాయట. ఇది కాస్త రష్మికి బాగా కోపం తెప్పించింది. 
 
వెంటనే నాటా నిర్వాహకులకు ఫోన్ చేసి చెడామడా తిట్టేసిందట. ఎందుకు మీరు ఇలా చేస్తున్నారు. నాటా నుంచి ఇంతవరకు ఎవరూ నాకు ఫోన్ చేయలేదు. నా ఫోటో ఎలా మీరు వేసుకుంటారు అని ప్రశ్నించదట. మరోసారి ఇలా జరిగితే బాగుండదని స్వీట్ వార్నింగ్ కూడా ఇచ్చిందట. రష్మి కోప్పడినా నిర్వాహకులు మాత్రం దాన్ని లైట్‌గా తీసుకున్నారట.