1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
  4. Lok Sabha Passes Bill to Provide Death to Child Rape Convicts

చిన్నారులపై లైంగిక దాడులకు పాల్పడితే ఇకపై ఉరితో మరణశాసనం

బాలికపై లైంగిక దాడులకు పాల్పడేవారిని కఠినంగా శిక్షించాలని కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఇందులోభాంగా, చిన్నారులపై అత్యాచారాలకు పాల్పడితే ఉరితో మరణశాసనం లిఖించనున్నారు. ఈ మేరకు లోక్‌సభలో ఓ బిల్లును ప్రవేశప

Lok Sabha
బాలికపై లైంగిక దాడులకు పాల్పడేవారిని కఠినంగా శిక్షించాలని కేంద్రం నిర్ణయం తీసుకుంది. ఇందులోభాంగా, చిన్నారులపై అత్యాచారాలకు పాల్పడితే ఉరితో మరణశాసనం లిఖించనున్నారు. ఈ మేరకు లోక్‌సభలో ఓ బిల్లును ప్రవేశపెట్టి దానికి ఆమోదముద్ర వేశారు.


బాలికలపై లైంగిక దాడులకు పాల్పడే కీచకులకు మరణశిక్షను విధించే ప్రతిపాదిత క్రిమినల్ లా (అమెండ్‌మెంట్) బిల్లు-2018కు పార్టీలకు అతీతంగా సభ్యులు ఏకగ్రీవంగా మద్దతు తెలిపారు. 
 
అంతకుముందు ఈ బిల్లుపై సభలో ఏకంగా రెండు గంటల పాటు చర్చ జరిగింది. ఈ సందర్భంగా పలువురు ఎంపీలు సూచనలు, సలహాలు అందజేశారు. అనంతరం సభ మూజువాణి ఓటుతో బిల్లుకు ఆమోదం తెలిపింది.

జమ్మూకాశ్మీర్‌లోని కతువా, యూపీలోని ఉన్నావ్‌లో ఇద్దరు చిన్నారులపై జరిగిన అకృత్యాలు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే.

ఈ నేపథ్యంలో 12 ఏండ్లలోపు పసిమొగ్గలపై అకృత్యాలకు పాల్పడితే మరణశిక్ష విధించే ఆర్డినెన్స్‌ను కేంద్రం ఏప్రిల్ 21న తెచ్చింది. అనంతరం తాజా బిల్లుకు రూపకల్పన చేసి ఆమోదముద్ర వేసేలా సత్వర చర్యలు తీసుకుంది. 
About Writer
pnr
తర్వాతి కథనం
అమ్మ శశికళ... జయ టీవీ చూస్తూ జ్యూస్ తాగుతున్నట్టుగా ఫేక్ వీడియో సృష్టి?