1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
  4. Mahesh Babu Extraordinary & Stunning Entry at Sammohanam Pre Release Event

మహేష్ బాబు లుక్ అదుర్స్.. సోషల్ మీడియాలో వైరల్

టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు తాజా సినిమా కోసం గడ్డం, మీసం పెంచేశారు. ఈ లుక్‌లో ప్రిన్స్ అదుర్స్ అనేలా వున్నారు. మహేశ్ బాబు ''భరత్ అనే నేను'' సినిమా తర్వాత మహేష్ బాబు వంశీ పైడిపల్లి దర్శకత్వంలో కొత్త స

Mahesh Babu
టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు తాజా సినిమా కోసం గడ్డం, మీసం పెంచేశారు. ఈ లుక్‌లో ప్రిన్స్ అదుర్స్ అనేలా వున్నారు. మహేశ్ బాబు ''భరత్ అనే నేను'' సినిమా తర్వాత మహేష్ బాబు వంశీ పైడిపల్లి దర్శకత్వంలో కొత్త సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో మహేష్ స్టూడెంట్‌గా కనిపిస్తాడని.. ఇంకా గడ్డం, మీసంతో కనిపిస్తాడని టాక్ వచ్చింది. 
 
ఇందుకు తగినట్లు మహేశ్ బాబు గెడ్డంతో ఉన్న ఫొటోలు సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.ఈరోజు తెలుగు మూవీ డబ్బింగ్‌ ఆర్టిస్ట్స్‌ యూనియన్‌ 25 ఏళ్ల వేడుక కార్యక్రమంలో అతిథిగా పాల్గొన్నాడు. 
 
ఈ సందర్భంగా తీసిన ఆయన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. ఇందులో గడ్డం, మీసాలతో మహేశ్‌ బాబు కనిపిస్తున్నాడు. ఈ లుక్‌‌లో మహేష్‌ను చూసిన ఫ్యాన్స్ అంతా సంబరపడిపోతున్నారు. తన అభిమాన హీరో ఇలాంటి లుక్‌లో కనిపించడం హ్యాపీ అంటూ సోషల్ మీడియాలో కామెంట్లు, లైకులు, షేర్లు చేస్తున్నారు. అలాగే సమ్మోహనం ప్రీ రిలీజ్ ఫంక్షన్లోనూ మహేష్ బాబు ఇదే లుక్‌లో కనిపించాడు.
About Writer
selvi
తర్వాతి కథనం
ప్రపంచమంతా సింగపూర్ వైపే చూస్తోంది.. ఎందుకు?