శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By Srinivas
Last Modified: శనివారం, 9 జూన్ 2018 (19:01 IST)

రైతు బంధు చెక్కును తిరిగిచ్చిన హీరో మహేష్ బాబు దంపతులు

రైతుబంధు పథకం కింద వచ్చిన చెక్కును సినీ నటుడు మహేష్ బాబు దంపతులు తిరిగి ప్రభుత్వానికి అందచేశారు. ఈ మేరకు మహేశ్వరం వ్యవసాయాధికారి కోటేశ్వర్ రెడ్డికి మొత్తం రూ. 16 వేల చెక్కును అందచేశారు. మహేశ్వరం మండలంలోని నాగారం పరిధిలో మహేష్ బాబుకు 39.2 గుంటల భూమి,

రైతుబంధు పథకం కింద వచ్చిన చెక్కును సినీ నటుడు మహేష్ బాబు దంపతులు తిరిగి ప్రభుత్వానికి అందచేశారు. ఈ మేరకు మహేశ్వరం వ్యవసాయాధికారి కోటేశ్వర్ రెడ్డికి మొత్తం రూ. 16 వేల చెక్కును అందచేశారు. మహేశ్వరం మండలంలోని నాగారం పరిధిలో మహేష్ బాబుకు 39.2 గుంటల భూమి, నమ్రత శిరోద్కర్ పేరున 1.20 ఎకరాలు భూమి ఉంది.
 
శుక్రవారం సమ్రతా శిరోద్కర్, మహేష్ బాబులకు వ్యవసాయాధికారి కోటేశ్వర్ రెడ్డి  రైతుబంధు చెక్కులు అందచేయగా సదరు చెక్కులను తిరిగి ప్రభుత్వానికి అందచేశారు మహేష్ బాబు దంపతులు.