శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By Srinivas
Last Modified: శనివారం, 2 జూన్ 2018 (19:44 IST)

మ‌హేష్ కోసం కెటిఆర్ ఏం చేసాడో తెలుసా..?

సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు - తెలంగాణ రాష్ట్ర మంత్రి కెటిర్ మ‌ధ్య మంచి అనుబంధం ఉంది. ఇటీవ‌ల భ‌రత్ అనే నేను సినిమా గురించి మ‌హేష్ - కె.టి.ఆర్ క‌లిసి ఇంట‌ర్వ్యూ ఇవ్వ‌డం తెలిసిందే. ఈ ఇంట‌ర్వ్యూలో కెటిఆర్... మ‌హేష్ అమ్మాయిల‌కే సెల్ఫీలు ఇస్తుంటాడు అనుకుంటా

సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు - తెలంగాణ రాష్ట్ర మంత్రి కెటిర్ మ‌ధ్య మంచి అనుబంధం ఉంది. ఇటీవ‌ల భ‌రత్ అనే నేను సినిమా గురించి మ‌హేష్ - కె.టి.ఆర్ క‌లిసి ఇంట‌ర్వ్యూ ఇవ్వ‌డం తెలిసిందే. ఈ ఇంట‌ర్వ్యూలో కెటిఆర్... మ‌హేష్ అమ్మాయిల‌కే సెల్ఫీలు ఇస్తుంటాడు అనుకుంటా అన్నాడు స‌ర‌దాగా.. త‌ను మాత్రం అబ్బాయిల‌కు కూడా సెల్ఫీ ఇస్తుంటాను అని చెప్పాడు. ఇప్పుడు దీనిని నిజం చేస్తూ... స్టేడియంలో అబ్బాయిల‌కు సెల్ఫీ ఇచ్చారు కెటిఆర్. 
 
ఈ ఫోటోను సెల్ఫీ తీసుకున్న వ్య‌క్తి ట్విట్ట‌ర్‌లో పోస్ట్ చూస్తూ... కెటిఆర్ అబ్బాయిల‌కు కూడా సెల్ఫీ ఇస్తుంటారు ఇది నిజ‌మే అన్నారు. దీనిపై కెటిఆర్ స్పందిస్తూ.. మ‌హేష్ బాబు ఇది నీ కోస‌మే అని ట్వీట్ చేసారు. దీనికి మ‌హేష్ బాబు స్పందిస్తూ.. బాగా నవ్వుతున్న ఎమోజీని పోస్ట్‌ చేశారు. ఇద్దరు సెలబ్రిటీల మధ్య జరిగిన ఈ సంభాషణ నెటిజన్లను ఆకట్టుకుంది.