గురువారం, 25 జులై 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
Written By pnr
Last Updated : గురువారం, 31 మే 2018 (12:01 IST)

జూదంలో ఓడాడు... భార్యను దగ్గరుండి మరీ రేప్ చేయించాడు.. ఎక్కడ?

మహాభారతంలో కౌరవ సోదరులతో ధర్మరాజు జూదమాడుతాడు. ఇందులో సంపద, రాజ్యాన్ని కోల్పోతాడు. ఆ తర్వాత తన నలుగురు సోదరులతో పాటు భార్య అయిన పాంచాలిని కూడా జూదంలో ఫణంగా పెట్టి ఓడిపోతాడు.

మహాభారతంలో కౌరవ సోదరులతో ధర్మరాజు జూదమాడుతాడు. ఇందులో సంపద, రాజ్యాన్ని కోల్పోతాడు. ఆ తర్వాత తన నలుగురు సోదరులతో పాటు భార్య అయిన పాంచాలిని కూడా జూదంలో ఫణంగా పెట్టి ఓడిపోతాడు.
 
ఇంతకంటే దారుణంగా ఓ తాగుబోతు భర్త ప్రవర్తించాడు. తను తెచ్చుకున్న డబ్బును కోల్పోయిన ఆ వ్యసనపరుడు.. ఏకంగా తన భార్యను జూదంలో ఫణంగా పెట్టాడు. ఈ జూదంలో ఆమెను కూడా కోల్పోయాడు. 
 
ఇక అంతే.. ఆమెను గెలుచుకున్న జూద నిర్వాహకుడు ఆమెపై మోజుపడి ఓ మృగంలా ప్రవర్తించాడు. ఆమెను తన గదికి బలవంతంగా లాక్కునిపోయి అత్యాచారం చేయబోయాడు. దీంతో ఆమె తీవ్రంగా ప్రతిఘటించి, గదిలోనుంచి బయటకు వచ్చింది. 
 
అయితే, ఆ నిర్వాహుకుడి ఆదేశం మేరకు కట్టుకున్న భర్తే.. భార్యను బలవంతంగా లాక్కొని గదిలోకి వెళ్లాడు. ఆమె చేతులను మంచానికి కట్టేశాడు. ఆ తర్వాత ఆ జూద నిర్వాహకుడు పాశవికంగా ఆమెపై అత్యాచారం చేస్తుంటే.. అతనికి సహకరిస్తూ రేప్‌ను చూస్తూ మిన్నకుండిపోయాడు తాగుబోతు భర్త. 
 
ఈ దారుణం ఈ నెల 23వ తేదీన ఒడిషాలోని బాలాసోర్‌ జిల్లా బలికూట్‌ అనే గ్రామంలో జరిగింది. ఇద్దరు పిల్లల తల్లి అయిన బాధితురాలు తొలుత కేసు పెట్టకూడదని భావించినా తర్వాత మనసు మార్చుకుని ఆమె ఫిర్యాదు చేసింది. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు, భర్తతో పాటు.. నిర్వాహకుడిని అదుపులోకి తీసుకున్నారు.