మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By pnr
Last Updated : శనివారం, 26 మే 2018 (16:28 IST)

గోవాలో ఘోరం ... ప్రియుడు కళ్ళెదుటే ప్రియురాలి గ్యాంగ్ రేప్...

గోవా బీచ్‌లో ఘోరం జరిగింది. తన ప్రియుడుతో కలిసి సముద్రతీరంలో కాస్త సేదతీరేందుకు వెళ్లిన 20 యేళ్ళ యువతి ముగ్గురు కామాంధుల చేతిలో సామూహిక అత్యాచారానికి గురైంది. శుక్రవారం సాయంత్రం జరిగిన ఈ వివరాలను పరిశ

గోవా బీచ్‌లో ఘోరం జరిగింది. తన ప్రియుడుతో కలిసి సముద్రతీరంలో కాస్త సేదతీరేందుకు వెళ్లిన 20 యేళ్ళ యువతి ముగ్గురు కామాంధుల చేతిలో సామూహిక అత్యాచారానికి గురైంది. శుక్రవారం సాయంత్రం జరిగిన ఈ వివరాలను పరిశీలిస్తే...
 
పనాజీ: గోవా బీచ్‌లో శుక్రవారం సాయంత్రం దారుణ సంఘటన చోటుచేసుకుంది. టూరింగ్ కోసం వచ్చిన ముగ్గురు మానవ మృగాలు 20 ఏళ్ల యువతిపై గ్యాంగ్‌రేప్‌కి పాల్పడ్డారు. ఆమె స్నేహితుడి ముందే దారుణానికి ఒడిగట్టి పారిపోయారు. సమాచారం అందుకున్న పోలీసులు 24 గంటల్లోగానే నిందితులను వలపన్ని పట్టుకున్నారు. 
 
దక్షిణ గోవా కోల్వా బీచ్‌ను సందర్శించేందుకు సమీప గ్రామానికి చెందిన బాధిత యువతి తన ప్రియుడుతో కలిసి వెళ్లింది. అదేసమయంలో ఇండోర్‌కి చెందిన ముగ్గురు వ్యక్తులు గోవాకు పర్యాటకులుగా వచ్చారు. 
 
అయితే, సాయంత్రం వేళ... బీచ్‌లో పెద్దగా జనాలు లేని సమయంలో ఈ జంట ఆ ముగ్గురు వ్యక్తుల కంటపడింది. అంతే.. ఆమె ప్రియుడిని కట్టేసిన ఆ కామాంధులు.. ఆ యువతిని చెరబట్టి.. బలవంతంగా దుస్తులు తొలగించారు. ఆ తర్వాత ఇద్దర్నీ నగ్నంగా ఫోటోలు తీసి, డబ్బులు గుంజుకుని, యువతిపై ఆమె స్నేహితుడి ముందే సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. పోలీసులకు చెబితే ఇద్దరి ఫోటోలు బయటపెడతామని బెదిరించి అక్కడినుంచి పారిపోయారు. 
 
అయితే, బాధితుల ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన పోలీసులు మెరుపు వేగంతో స్పందించి.. ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. పరారీలో ఉన్న మరో నిందితుడి కోసం ప్రత్యేక బృందాలతో గాలింపు చేపట్టామని దక్షిణ గోవా ఎస్పీ అర్వింద్ గవాస్ పేర్కొన్నారు. వైద్యపరీక్షల్లో యువతిపై అత్యాచారం జరిగినట్టు నిర్ధారణ కావడంతో.. నిందితులపై ఐపీసీ సెక్షన్ 376 అత్యాచారం), సెక్షన్ (దోపిడీ) సహా పలు సెక్షన్లపై కేసు నమోదు చేశారు.  gang rape