సోమవారం, 23 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. మహిళ
  3. సౌందర్యం
Written By Kowsalya
Last Updated : బుధవారం, 23 మే 2018 (15:15 IST)

కేశ సంరక్షణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు?

తల వెంట్రుకలు రాలతుంటే ఎంతో బాధగా ఉంటుంది. వెంట్రుకలు రాలటం వల్ల అటు మగవారు ఇటు ఆడవారూ ఎంతో బాధకు గురవుతున్నారు. ఈ రోజుల్లో ఈ సమస్య చాలా సర్వ సాధరణం అయిపోయింది. ఈ సమస్య నుంచీ బయటపడాలంటే కొన్ని గృహ చిట

తల వెంట్రుకలు రాలుతుంటే ఎంతో బాధగా ఉంటుంది. వెంట్రుకలు రాలటం వల్ల అటు మగవారు ఇటు ఆడవారూ ఎంతో బాధకు గురవుతున్నారు. ఈ రోజుల్లో ఈ సమస్య చాలా సర్వ సాధరణం అయిపోయింది. ఈ సమస్యతో బాధపడేవారు చాలా రకాలైన చికిత్సలు తీసుకుంటూ షాపుల చుట్టూ, పార్లర్ల చుట్టూ తిరుగుతున్నారు. అంతేకాక థైరాయిడ్ సమస్య వల్ల కూడా జుట్టు రాలుతుంది. అలాగే రక్తప్రసరణ జరగకపొవటం, పౌష్టికాహారలోపం, జన్యు పరమైన సమస్యలు కూడా కావచ్చు. ఈ సమస్య నుంచీ బయటపడాలంటే కొన్ని గృహ చిట్కాలు ఉన్నాయి. అవేంటో చూద్దాం..
 
మెంతులు ప్రతీ ఇంటిలో ఉండేవే. కానీ వీటి గొప్పదనం ఎంతో ఉంది. వీటిలో హార్మోన్ యాంటీయాసిడెంట్లు ఉండటమే కాక నికోటినిచ్ ఆసిడ్ ఉండటం వల్ల వెంట్రుకలు ఊడకుండా చేయటమే కాక కుదుళ్ళు గట్టిపడేలా చెసి వెంట్రుకలు రాలకుండా చేయటమేకాక మల్లి జుట్టు మొలిచేలా కూడా చేస్తుంది. 
 
మెంతుల్ని తీసుకుని వాటిని నీటిలో రాత్రి అంతా నానపెట్టాలి. పొద్దున్నే వాటిని గ్రైండ్ చేసుకోవాలి. ఇలా తయారైన మిశ్రమాన్ని స్కాల్ప్ కు కుడుళ్ళవరకూ పట్టించాలి. 30 నిముషాలు పాటు ఉంచుకుని తరువాత నీటితో కడిగేసుకోవాలి. దీనికి షాంపూ అవసరం లేదు. ఇలా వారానికి 2 సార్లు చేస్తే మంచి ఫలితాలు మీరు చూడవచ్చును. 
 
ఉల్లిపాయల్ని తీసుకుని గుజ్జుగా గ్రైండ్ చేసుకుని మీ కుదుళ్ళకి ఆ మిశ్రమాన్ని పట్టించుకుని కాసేపాగిన తరువాత కడుగుకుంటే జుట్టు రాలటం తగ్గుతుంది. ఎందుకంటే ఉల్లిపాయలు రక్తప్రసరనను సరి చేయుటకు ఉపయోగపడుతాయి. 
 
వెంట్రుకలను నిదానంగా, మృదువుగా దువ్వాలి. వెంట్రుకలు దువ్వటానికి బ్రష్‌గాని, దువ్వెనగాని ఉపయోగించినప్పుడు లైట్‌గా దువ్వాలి. మీ వెంట్రుకల టైపు తెలుసుకుని దానికి తగినట్లుగా నూనెను షాంపులు ఉపయోగించాలి. 
 
షాంపు ఎన్నికలలో జాగ్రత్తగా ఉండాలి. వెంట్రుకలు మురికిగాఉంటే ఇతర వెంట్రుకలను పాడుచేస్తాయి. వెంట్రుకలకు ఉపయోగించే కండీషనర్ల గురించి తెలుసుకుని షాంపూలతో పాటు ఉపయోగించాలి. వెంట్రుకలను ఆరపెట్టడానికి ఎలక్ట్రిక్ పరికరాలను వాడక సహజరీతిలో వాటిని ఎండబెట్టాలి. టీనేజ్‌లో ఉన్నప్పుడు వెంట్రుకలకు రసాయనిక ప్రక్రియలను ఉపయోగించకూడదు. 
 
ముఖ్యంగా షర్మింగ్, బ్లీచింగ్, కలరింగ్, స్ట్రెయిట్‌నింగ్ మొదలైన వాటిని ఉపయోగించరాదు. వెంట్రుకలను అదేపనిగా ఎండలోఉంచి ఆరబెట్టరాదు. నీడలోగాని, ఫ్యాన్ క్రిందగాని నిలబడి తలను ఆరబెట్టుకోవాలి.