సోమవారం, 6 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By ivr
Last Updated : సోమవారం, 21 మే 2018 (11:27 IST)

విమానంలో పక్క సీట్లో మహిళను చూస్తూ హస్త ప్రయోగం... ఢిల్లీలో అరెస్ట్

ఈమధ్య బస్సులు, రైళ్లలో కామాంధులు రెచ్చిపోవడం గురించి వింటున్నాం. ఈసారి 58 ఏళ్ల వృద్ధుడు తన తోటి ప్రయాణికురాలి పట్ల అసభ్యంగా ప్రవర్తించి అరెస్టయ్యాడు. విమానంలో తన పక్క సీట్లో కూర్చున్న మహిళను చూస్తూ హస

ఈమధ్య బస్సులు, రైళ్లలో కామాంధులు రెచ్చిపోవడం గురించి వింటున్నాం. ఈసారి 58 ఏళ్ల వృద్ధుడు తన తోటి ప్రయాణికురాలి పట్ల అసభ్యంగా ప్రవర్తించి అరెస్టయ్యాడు. విమానంలో తన పక్క సీట్లో కూర్చున్న మహిళను చూస్తూ హస్త ప్రయోగం చేసి అరెస్టయ్యాడు.
 
వివరాల్లోకి వెళితే... రష్యన్ పాస్‌పోర్ట్ కలిగిన ఎన్నారై మే 20, ఆదివారం వేకువజామున ఢిల్లీలో అరెస్టయ్యాడు. తన తోటి ప్రయాణికురాలి పట్ల అసభ్యంగా ప్రవర్తించాడు. టికె-716 ఫ్లయిట్ ఢిల్లీకి వస్తోంది. ఆ విమానంలో 58 ఏళ్ల ఎన్నారై ఓ మహిళ ప్రక్కనే కూర్చున్నాడు. విమానం ప్రయాణిస్తున్న సమయంలో సదరు వ్యక్తి తన ప్యాంటు జిప్ ఓపెన్ చేసి హస్త ప్రయోగం చేయడం ప్రారంభించాడు. 
 
ఈ హఠత్పరిణామానికి షాక్ తిన్న మహిళా ప్రయాణికురాలు వెంటనే విషయాన్ని క్రూ సిబ్బందికి తెలియజేసింది. మహిళ ఫిర్యాదుతో అతడిని ఆ సీటు నుంచి ఖాళీ చేయించి వేరేచోట కూర్చోబెట్టారు. ఆ తర్వాత ఫ్లయిట్ ఢిల్లీలో ల్యాండ్ కాగానే అతడిని అరెస్టు చేసి దర్యాప్తు చేస్తున్నారు.