బుధవారం, 8 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. అంతర్జాతీయ వార్తలు
Written By selvi
Last Updated : గురువారం, 17 మే 2018 (18:54 IST)

చైనా క్యాబ్ డ్రైవర్ ఓవరాక్షన్.. అందంగా వున్నావని పట్టపగలే?

మహిళలపై క్యాబ్ డ్రైవర్ల లైంగిక దాడులు పెచ్చరిల్లిపోతున్నాయి. చైనాలో మహిళా ప్రయాణీకురాలిపై క్యాబ్ డ్రైవర్ లైంగిక దాడికి యత్నించాడు. అతడిని పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాల్లోకి వెళితే.. ఫయూన్‌ టాక్సీ కం

మహిళలపై క్యాబ్ డ్రైవర్ల లైంగిక దాడులు పెచ్చరిల్లిపోతున్నాయి. చైనాలో మహిళా ప్రయాణీకురాలిపై క్యాబ్ డ్రైవర్ లైంగిక దాడికి యత్నించాడు. అతడిని పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాల్లోకి వెళితే.. ఫయూన్‌ టాక్సీ కంపెనీకి చెందిన క్యాబ్‌ను సదరు మహిళ బుక్‌ చేసుకుంది. క్యాబ్‌లో ఎక్కిన తర్వాత డ్రైవర్ ఆమెతో మాటలు కలిపాడు. అందంగా వున్నవంటూ కితాబిచ్చాడు. ఆమెపై చేతులేసి అసభ్యకరంగా ప్రవర్తించాడు.
 
ప్రతిఘటించేసరికి లైంగిక దాడికి ప్రయత్నించాడు. అతని బారినుంచి తప్పించుకున్న బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ ఘటన పట్టపగలే చోటుచేసుకుంది. దీనిపై బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. 
 
కారులోని కెమెరా ఆధారంగా డ్రైవర్ నిందితుడని తేల్చిన పోలీసులు.. కేసు నమోదు చేసి పది రోజుల పాటు రిమాండ్‌కు తరలించారు. అతని లైసెన్స్‌ కూడా రద్దు చేసినట్లు అధికారులు తెలిపారు. ఇక క్యాబ్‌ డ్రైవర్‌ నిర్వాకంపై సదరు ట్యాక్సీ సంస్థ కూడా అతనిని తొలగిస్తున్నట్లు ప్రకటించింది.