మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pnr
Last Updated : సోమవారం, 7 మే 2018 (16:42 IST)

చైనాలో దుమ్ము రేపుతున్న 'బాహుబలి'... కొత్త నటీనటులతో ప్రిక్వెల్

ప్రభాస్ - దగ్గుబాటి రానా - ఎస్ఎస్ రాజమౌళి కాంబినేషన్‌లో తెరక్కిన చిత్రం "బాహుబలి". ఈ చిత్రం భారతీయ భాషల్లోనేకాకుండా జపనీస్ భాషలోనూ సరికొత్త రికార్డులు నెలకొల్పింది. ముఖ్యంగా, భారతీయ చలన చిత్ర పరిశ్రమల

ప్రభాస్ - దగ్గుబాటి రానా - ఎస్ఎస్ రాజమౌళి కాంబినేషన్‌లో తెరక్కిన చిత్రం "బాహుబలి". ఈ చిత్రం భారతీయ భాషల్లోనేకాకుండా జపనీస్ భాషలోనూ సరికొత్త రికార్డులు నెలకొల్పింది. ముఖ్యంగా, భారతీయ చలన చిత్ర పరిశ్రమలో ఇప్పట్లో మరో చిత్రం చేరుకోలనంత రికార్డును సాధించింది.
 
ఇటీవల చైనాలో కూడా విడుదలై దుమ్మురేపుతోంది. ఈ నేపథ్యంలో ఆ చిత్ర నిర్మాత శోభు యార్లగడ్డ మీడియాతో మాట్లాడుతూ సంచలన ప్రకటన చేశారు. మరో నిర్మత దేవినేని ప్రసాద్‌తో కలసి మీడియాతో మాట్లాడిన ఆయన, బాహుబలి ప్రీక్వెల్‌ను త్వరలోనే నిర్మించనున్నట్టు తెలిపారు. 
 
ఇంగ్లీష్, హిందీ భాషల్లో ఆన్ లైన్ సిరీస్‌గా ఈ ప్రీక్వెల్‌ ను నిర్మిస్తామని తెలిపారు. దీని చిత్రీకరణ ఆగస్టు నుంచి మొదలవుతుందని వెల్లడించారు. ఈ ప్రీక్వెల్‌లో అంతా కొత్త నటీ నటులు కనిపిస్తారని, శివగామి చిన్నతనం నుంచి మాహిష్మతి సామ్రాజ్యం విస్తరించిన తీరును చూపిస్తామని చెప్పారు. 
 
ఇప్పటికే ఉన్న మాహిష్మతి సెట్‌తో పాటు మరికొన్ని సెట్స్ వేసి దీన్ని షూట్ చేయనున్నామని, మరిన్ని వివరాలను త్వరలోనే వెల్లడిస్తామని అన్నారు. శివగామి చిన్నతనం, మాహిష్మతికి కోడలు కావడం, కట్టప్ప ఎక్కడివాడు? ఎందుకు రాజ్యానికి బాసిన అయ్యాడు? తదితరాంశాలను ఇందులో చూపిస్తామని తెలిపారు.