బుధవారం, 8 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By selvi
Last Updated : శుక్రవారం, 18 మే 2018 (17:59 IST)

భోపాల్‌లో మరో నిర్భయ: రహస్య భాగాల నుంచి బీర్, కూల్‌డ్రింక్స్ బాటిళ్లు

నిర్భయ తరహాలో భోపాల్‌లో అమానవీయ ఘటన వెలుగులోకి వచ్చింది. భోపాల్‌లో 28 ఏళ్ల మహిళ దారుణంగా అత్యాచారం, హత్యకు గురైంది. మహిళపై అత్యాచారానికి పాల్పడిన దుండగులు ఆమె పట్ల దారుణంగా ప్రవర్తించారని పోలీసులు తెల

నిర్భయ తరహాలో భోపాల్‌లో అమానవీయ ఘటన వెలుగులోకి వచ్చింది. భోపాల్‌లో 28 ఏళ్ల మహిళ దారుణంగా అత్యాచారం, హత్యకు గురైంది. మహిళపై అత్యాచారానికి పాల్పడిన దుండగులు ఆమె పట్ల దారుణంగా ప్రవర్తించారని పోలీసులు తెలిపారు. పోస్టుమార్టం సందర్భంగా ఆమె రహస్య భాగాల నుంచి బీరు, కూల్‌డ్రింక్ బాటిళ్లను వైద్యులు వెలికి తీశారు. 
 
వివరాల్లోకి వెళితే.. సెహోర్ జిల్లాలోని ఇచ్చావర్ పట్టణానికి చెందిన మహిళ మరో వ్యక్తితో కలిసి ప్రగతి నగర్‌లో ఓ అద్దె ఇంట్లో వుంటోంది. కానీ ఆమె నివసిస్తున్న గది నుంచి దుర్వాసన రావడంతో ఇంటి ఓనర్ పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు రంగంలోకి దిగి.. తలుపులు పగులకొట్టి లోపలికి ప్రవేశించారు. అక్కడ నగ్నంగా పడి వున్న మహిళ మృతదేహం కనిపించింది. 
 
ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. రెండు రోజులు క్రితం ఆమెపై అత్యాచారం జరిగిందని.. ఆపై ఆమెను హత్య చేశారని ప్రాథమిక విచారణలో తేల్చారు. ఆపై ఆమె మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. 
 
పోస్టుమార్టం సందర్భంగా మహిళ దారుణంగా హత్యకు గురైందని.. ఆమె రహస్య భాగాల నుంచి బీరు, సాఫ్ట్ డ్రింక్ బాటిళ్లను వైద్యులు వెలికి తీసినట్టు పోలీసులు తెలిపారు. కాగా, అత్యాచారం, హత్యకు గురైన మహిళకు భర్తగా చెప్పుకుంటున్న వ్యక్తి పరారీలో వున్నాడు. అతని కోసం పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు.