ఆ జడ్పీటీసీ వరుసకు నాకు సోదరుడు.. కోర్కె తీర్చమని వేధిస్తున్నాడు...
ఆ జడ్పీటీసీ వరుసకు నాకు సోదరుడు. కానీ, కోర్కె తీర్చమని వేధిస్తున్నాడంటూ ఓ మహిళ పోలీసులను ఆశ్రయించింది. ఆస్తి విషయంలో తనపై లైంగిక వేధింపులకు పాల్పడడమేకాకుండా దాడికి యత్నించాడని పేర్కొంది.
ఆ జడ్పీటీసీ వరుసకు నాకు సోదరుడు. కానీ, కోర్కె తీర్చమని వేధిస్తున్నాడంటూ ఓ మహిళ పోలీసులను ఆశ్రయించింది. ఆస్తి విషయంలో తనపై లైంగిక వేధింపులకు పాల్పడడమేకాకుండా దాడికి యత్నించాడని పేర్కొంది. అతనిపేరు ప్రకాశ్ రెడ్డి. దాచేపల్లి జడ్పీటీసీ. ఈయనపై చర్యలు తీసుకోవాలని ముత్యాలంపాడుకు చెందిన తాడికొండ జ్యోతి అనే మహిళ రూరల్ ఎస్పీ అప్పల నాయుడును కోరారు. ఈ మేరకు శుక్రవారం ఫిర్యాదు చేసింది. ఆ తర్వాత ఆమె మాట్లాడుతూ...
'నా భర్త సీతారామిరెడ్డి 2006లో కేన్సర్‌తో చనిపోయారు. మాకు ఇద్దరు కుమార్తెలున్నారు. భర్త మృతికి ముందే మా మేనత్తకు పిల్లలు లేకపోవడంతో దత్తత ఇచ్చాం. 2008లోనే బావ శ్రీనివాసరెడ్డి, నా భర్త బావ ప్రకాశ్‌రెడ్డిలు వేధింపులకు గురిచేశారు. వేధింపులు భరించలేక పురుగు మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాను. ఈ క్రమంలో వారు నన్ను కొట్టి ఇంటి నుంచి గెంటి వేశారు. అప్పటి నుంచి మాచర్లలోని పుట్టింట్లో చిన్న కుమార్తెతో కలిసి ఉంటున్నాను.
మాకు ముత్యాలంపాడులో ఐదు ఎకరాల పొలం, 4 ఇళ్ల స్థలాలు, బీడు భూమి ఉన్నాయి. ఆస్తిని నా తదనంతరం ఇద్దరు కుమార్తెలకు సమానంగా చెందేలా వీలునామా కూడా రాశాను. అప్పటి నుంచి పొలం కౌలు కూడా నేనే తీసుకుంటున్నాను. నాకు సోదరుడు వరసయ్యే ప్రకాశ్‌రెడ్డి రెండేళ్లుగా కౌలు డబ్బు తీసుకోవడమే కాక పాస్ పుస్తకాలను కూడా తన వద్దే ఉంచుకున్నాడు. తాను చెప్పినట్లు వింటే ఆస్తి విషయంలో అడ్డురానని వేధిస్తున్నాడు. అలా నన్ను వేధిస్తూ, దాడి చేసి కొట్టించిన జడ్పీటీసీ ప్రకాశ్‌రెడ్డితో పాటు నిందితులపై తగిన చర్యలు తీసుకోవాలి' అని కోరింది.