సోమవారం, 6 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By selvi
Last Updated : శుక్రవారం, 25 మే 2018 (15:48 IST)

సోదరి వరసయ్యే నాతో కోరిక తీర్చమని వేధిస్తున్నాడు..

గుంటూరు జిల్లా దాచేపల్లి జెడ్పీటీసీ వేధింపులు వెలుగులోకి వచ్చాయి. జెడ్పీటీసీ ప్రకాష్ రెడ్డి తనను లైంగికంగా వేధిస్తున్నాడని వేధిస్తున్నాడంటూ ముత్యాలంపాడుకు చెందిన జ్యోతి ఎస్పీ అప్పల నాయుడికి ఫిర్యాదు చ

గుంటూరు జిల్లా దాచేపల్లి జెడ్పీటీసీ వేధింపులు వెలుగులోకి వచ్చాయి. జెడ్పీటీసీ ప్రకాష్ రెడ్డి తనను లైంగికంగా వేధిస్తున్నాడని వేధిస్తున్నాడంటూ ముత్యాలంపాడుకు చెందిన జ్యోతి ఎస్పీ అప్పల నాయుడికి ఫిర్యాదు చేసింది.

వివరాల్లోకి వెళితే.. జ్యోతి భర్త మరణించినప్పటి నుంచి ఆస్తి పంపకాల్లో జెడ్పీటీసీ తలదూర్చారని.... పొలం పాసు పుస్తకాలు రాకుండా రెవిన్యూ సిబ్బందితో కలిసి ప్రకాష్ రెడ్డి అడ్డుకుంటున్నట్లు మహిళ వాపోయింది. 
 
సోదరి వరుస అయ్యే తనతో కోరిక తీర్చాలని వేధిస్తున్నాడని ఆరోపించింది. ఈ వ్యవహారంపై పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో మాజీ మావోయిస్ట్ నర్సిరెడ్డితో దాడి చేయించాడని విమర్శలు గుప్పించింది. అయితే జ్యోతి వ్యాఖ్యలను ప్రకాష్ రెడ్డి ఖండించారు. జ్యోతి తన బావమరిది భార్య అని.. భర్త చనిపోయిన తర్వాత మరో పెళ్లి చేసుకుందని చెప్పారు. ఆస్తుల కోసమే జ్యోతి డ్రామాలు చేస్తుందని ప్రకాష్‌రెడ్డి ఆరోపణలు చేశారు.