సంబంధిత వార్తలు
- అరుణాచల్ ప్రదేశ్ కావాలంటోన్న చైనా! 30 వేల వరల్డ్ మ్యాచ్లను తగలబెట్టేసింది...
- ఎన్నికల తర్వాత పాకిస్థాన్లో విషాద ఛాయలు: విజయ్ రూపానీ
- మిడిల్ స్టంప్ కింద పడింది.. కానీ బెయిల్స్ చెక్కు చెదర్లేదు.. ఔటా.. నాటౌటా?
- వామ్మో.. కత్తులు.. పైథాన్ పాములతో మసాజ్.. ఎక్కడ?
- బీజేపీ తీర్థం పుచ్చుకున్న గంభీర్.. ఘాటుగా కౌంటరిచ్చిన కోహ్లీ
అంతరిక్షంలో ఉపగ్రహాన్ని పేల్చిన భారత్... ఉలిక్కిపడిన చైనా-పాక్
కేవలం 3 నిమిషాల్లోనే 300 కిలోమీటర్ల ఎత్తులో వున్న ఉపగ్రహాన్ని తునాతునకలు చేసింది మిషన్ శక్తి. దీనిపై ప్రధానమంత్రి మోదీ శాస్త్రవేత్తలకు అభినందనలు తెలిపారు. అంతరిక్షంలో ఉపగ్రహాన్ని దిగ్విజయంగా ఢీకొట్టడం ద్వారా భారతదేశం అగ్రదేశాల సరసన చేరిందన్నారు. తమ ప్రయోగం ఏ దేశాన్ని ఉద్దేశించింది కాదన్నారు. మిషన్ శక్తి సక్సెస్‌తో భారత్ అంతరిక్షంలో మహాశక్తిగా ఎదిగిందన్నారు.
భారతదేశం ప్రయోగించిన యాంటీ శాటిలైట్ విషయం తెలియగానే పాకిస్తాన్-చైనాలు ఉలిక్కిపడ్డాయి. పాకిస్తాన్ విదేశాంగ మంత్రి మాట్లాడుతూ... అంతరిక్షం అందరిది.. అక్కడ కూడా ఇలాంటి విన్యాసాలు తగవని భారతదేశం పేరును ప్రస్తావించకుండా సన్నాయినొక్కులు నొక్కారు. చైనా స్పందిస్తూ... ఎలాంటి పరీక్షలు చేసినా ప్రపంచంలోని అన్ని దేశాలు శాంతియుతంగా వుండాలన్నదే తమ అభిమతం అని పేర్కొంది.
కాగా మిషన్ శక్తిని ప్రయోగించి విజయవంతం చేయడం ద్వారా భారతదేశం అగ్ర రాజ్యాలైన అమెరికా, రష్యా, చైనా దేశాల సరసన చేరింది.
