1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
  4. Pakistani man abducted woman from wedding and forced to married off

హిందూ యువతిని బలవంతంగా ఎత్తుకెళ్లి పెళ్లి చేసుకున్న పాక్ యువకుడు

Pakistani man
పాకిస్తాన్ లోని మైనారిటీలకు రానురాను రక్షణ కరవవుతోంది. ఇటీవలి కాలంలో వరుసగా చోటుచేసుకుంటున్న ఘటనలతో అక్కడి హిందువులు భయాందోళనలకు గురవుతున్నారు. తాజాగా మరో ఘటన చోటుచేసుకుంది. పెళ్లి మండపంలో ఓ హిందూ యువతికి పెళ్లి జరుగుతుండగానే ముస్లిం యువకుడు బలవంతంగా యువతిని ఎత్తుకెళ్లి ఆమె మతం మార్చి వివాహం చేసుకున్నాడు. 
 
పూర్తి వివరాలు చూస్తే... బాధితురాలి తండ్రి కిశోర్ దాస్ తన 24 ఏళ్ల కుమార్తె భారతీ బాయికి మరో హిందూ యువకుడితో పెళ్లి చేస్తున్నాడు. పెళ్లి తంతు జరుగుతూ వుండగానే వేదికపైకి షారుఖ్ గుల్ అనే యువకుడు పోలీసులతో అక్కడకు వచ్చాడు. పెళ్లి కుమార్తెను పోలీసుల సాయంతో బలవంతంగా ఎత్తుకెళ్లిపోయాడు. 
 
అనంతరం ఆమె మతాన్ని మార్చేశాడని బాధితురాలి తండ్రి ఆరోపిస్తున్నారు. తన కుమార్తె పేరును బుష్రాగా పేరు మార్చాడనీ, ఇద్దరి పేరిట మ్యారేజ్ సర్టిఫికెట్ కూడా జారీ చేయడమే కాకుండా తన కుమార్తె మతాన్ని గత ఏడాది డిసెంబర్ మొదటివారంలో మారినట్లు సర్టిఫికెట్లు పుట్టించారని ఆవేదన వ్యక్తం చేశాడు. ఈ ఘటనపై పాకిస్తాన్ లోని హిందువులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. మైనారిటీలను రక్షిస్తామని చెపుతున్న ప్రధాని ఇమ్రాన్ ఖాన్ ఏం చేస్తున్నారంటూ ప్రశ్నిస్తున్నారు.
తర్వాతి కథనం
మండలి సవరణలు సభ పాటించాల్సిన పని లేదు: జగన్‌