గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. జాతీయ వార్తలు
Written By సెల్వి
Last Updated : ఆదివారం, 26 జనవరి 2020 (15:38 IST)

మరదలిపై బావ యాసిడ్ దాడి.. కారణం ఏంటంటే?

మరదలిపై బావ యాసిడ్ దాడి చేసిన ఘటన మంగుళూరులో జరిగింది. దక్షిణ కన్నడ జిల్లాలోని కడబాకు చెందిన స్వప్న, జయానంద కొట్టరీ మధ్య ఆర్థిక, ఆస్తుల వివాదం నడుస్తుంది. వీరిద్దరూ వరుసకు బావా మరదళ్లు. 
 
వివాదం మనసులో పెట్టుకున్న జయానంద.. స్వప్పపై యాసిడ్ దాడి చేశాడు. ఈ దాడిలో స్వప్ప ముఖానికి గాయలయ్యాయి. స్వప్పతో పాటు ఆమె మూడెళ్ల కుమార్తె కూడా గాయపడింది. వెంటనే వారిద్దరిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. 
 
ప్రస్తుతం స్వప్న, ఆమె కూతురు ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్లు వైద్యులు తెలిపారు. స్వప్ప ఫిర్యాదు మేరకు కడబా పోలీసులు కేసు నమోదు చేసి.. నిందితుడు జయానందను అదుపులోకి తీసుకున్నారు.