1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
  4. Posani Krishnamurali sensational comments on AP Special Status

నేను చెప్పింది చేసిన తరువాత హోదా రాకుంటే నన్ను చంపేయండి... పోసాని

ఎప్పుడూ ఏదో ఒకటి మాట్లాడుతూ వార్తల్లోకెక్కుతుంటారు నటుడు పోసాని క్రిష్ణమురళి. ఎపిలో నెలకొన్న పరిస్థితుల నేపధ్యంలో ప్రత్యేక హోదా కోసం రెండు సలహాలను ఇచ్చారు. కేంద్రంపై ఒత్తిడి తీసుకువచ్చే ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా ప్రత్యేక హోదాను సాధించుకుని తీరుతామన్న

Posani Krishnamurali
ఎప్పుడూ ఏదో ఒకటి మాట్లాడుతూ వార్తల్లోకెక్కుతుంటారు నటుడు పోసాని క్రిష్ణమురళి. ఎపిలో నెలకొన్న పరిస్థితుల నేపధ్యంలో ప్రత్యేక హోదా కోసం రెండు సలహాలను ఇచ్చారు. కేంద్రంపై ఒత్తిడి తీసుకువచ్చే ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా ప్రత్యేక హోదాను సాధించుకుని తీరుతామన్న నమ్మకాన్ని వ్యక్తం చేశారాయన. పోసాని చెప్పిన రెండు సలహాలు ఇప్పటివరకు ఎవరూ చెప్పలేదు. ఎక్కడా మాట్లాడలేదు.
 
అందులో మొదటిది.. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో పాటు ప్రతిపక్షాలకు చెందిన నేతలందరూ కూడా కలిసికట్టుగా అమరావతి ముందు నెలరోజుల పాటు ఆమరణ నిరాహారదీక్షకు కూర్చోవాలి. వారితో పాటు నేను కూడా కూర్చుంటాను. ఇలా చేస్తే మోడీ స్వయంగా అమరావతికి వచ్చి హోదా ఇచ్చి వెళతారు. 
 
ఇక రెండవది 3 కోట్లమంది ప్రజలు పాదయాత్రగా ఢిల్లీకి వెళదాం. ప్రజా సంఘాలన్నీ ఐక్యమై ముందుకు వెళుతుంటే ప్రజలు కలిసి రావాలి. ఇలా చేస్తే ఖచ్చితంగా ప్రత్యేక హోదా వస్తుంది. ఒకవేళ అప్పటికీ ఇవ్వకుండా... నా సలహా ఫెయిలైతే నన్ను చంపేయండి అన్నారు పోసాని క్రిష్ణమురళి. పోసాని క్రిష్ణమురళి చేసిన వ్యాఖ్యలకు వేలాదిమంది యువత మద్ధతు తెలుపుతూ సందేశాలు పంపారు. దటీజ్ పోసాని.
About Writer
TJ
తర్వాతి కథనం
శ్రీదేవికి దివ్యభారతి దెయ్యం పట్టింది... రవీనా టాండన్ షాకింగ్ కామెంట్స్