1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
  4. Chittore MP Sivaprasad comments on Prime Minister Narendra Modi over AP Special Status

మోడీ నువ్వు చంద్రబాబు జోడి వదులుకుంటే నీకు మిగిలేది బోడి... ఎంపి శివప్రసాద్(వీడియో)

ప్రధానమంత్రి నరేంద్రమోడీపై తీవ్రస్థాయిలో ఫైరయ్యారు చిత్తూరు ఎంపి శివప్రసాద్. ఎపికి ప్రత్యేక హోదా ఇవ్వనని చెప్పిన ఆర్థికమంత్రి అరుణ్‌ జైట్లీకి, ప్రధానమంత్రి నరేంద్రమోడీకి తెలుగు వాడి చెంపదెబ్బ రుచి చూపించాలన్నారు. మోడీ నువ్వు చంద్రబాబు జోడి వదులుకుంటే

Chittore MP
ప్రధానమంత్రి నరేంద్రమోడీపై తీవ్రస్థాయిలో ఫైరయ్యారు చిత్తూరు ఎంపి శివప్రసాద్. ఎపికి ప్రత్యేక హోదా ఇవ్వనని చెప్పిన ఆర్థికమంత్రి అరుణ్‌ జైట్లీకి, ప్రధానమంత్రి నరేంద్రమోడీకి తెలుగు వాడి చెంపదెబ్బ రుచి చూపించాలన్నారు. మోడీ నువ్వు చంద్రబాబు జోడి వదులుకుంటే నీకు మిగిలేది బోడి అంటూ ఎద్దేవా చేశారు. రాష్ట్ర విభజన వద్దని ఏవిధంగా అయితే ఉద్యమాన్ని నడిపంచారో.. ప్రత్యేక హోదా కోసం 13 జిల్లాల్లోని ప్రజా సంఘాలన్నీ ఐక్యమై కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు.
 
చంద్రబాబును చూస్తే మోడీకి భయమని, 2019 ఎన్నికల్లో తనకు పోటీగా చంద్రబాబు నాయుడు ఎక్కడ వస్తాడేమోనని మోడీ భయపడిపోతున్నాడని చెప్పారు. ఎపితో దోస్తీ పోగొట్టుకున్న మోడీకి ఇక మిగిలింది బోడీ మాత్రమేనన్నారు. పార్లమెంటు సమావేశాలు ముగిసేలోపైనా మోడీ ప్రత్యేక హోదా ఇస్తూ ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. చూడండి వీడియో...
తర్వాతి కథనం
నేను అవినీతికి పాల్పడి ఉంటే నాశనమైపోతా : మాజీ మంత్రి కామినేని(వీడియో)