శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By selvi
Last Updated : బుధవారం, 14 మార్చి 2018 (17:58 IST)

తెలంగాణ అసెంబ్లీలో కోమటిరెడ్డి ఓవరాక్షన్.. మైక్ హెడ్‌ఫోన్ విసిరితే..?

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైనాయి. అలాగే విపక్షాలు నిరసనలు కూడా ప్రారంభమైనాయి. తెలంగాణ సర్కారుపై నిరసన పేరుతో కాంగ్రెస్ శాసనసభ్యులు.. గవర్నర్ ప్రసంగాన్ని అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో పే

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమైనాయి. అలాగే విపక్షాలు నిరసనలు కూడా ప్రారంభమైనాయి. తెలంగాణ సర్కారుపై నిరసన పేరుతో కాంగ్రెస్ శాసనసభ్యులు.. గవర్నర్ ప్రసంగాన్ని అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో పేపర్లు, పెన్నులు గవర్నర్‌పై విసిరేశారు. ఇక కాంగ్రెస్ శాసనసభ్యుడు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అయితే ఓవరాక్షన్ చేశారు. 
 
మైక్ హెడ్‌ఫోన్‌ను గవర్నర్‌పైకి విసరగా అది గాంధీ ఫోటోకు తగిలి దాని కింద కూర్చునే  శాసనమండలి చైర్మన్ స్వామిగౌడ్‌పై పడింది. దీంతో స్వామిగౌడ్‌ కంటికి గాయమైంది. వెంటనే స్వామిగౌడ్‌ను సరోజినిదేవి కంటి ఆస్పత్రికి తరలించి కంటి పరీక్ష చేయించారు. స్వల్పంగా స్వామిగౌడ్‌ కంటికి గాయమైనట్లు వైద్యులు తెలిపారు.
 
ఈ సందర్భంగా స్వామిగౌడ్ మాట్లాడుతూ.. గవర్నర్ ప్రసంగాన్ని అడ్డుకునే క్రమంలో కాంగ్రెస్ సభ్యులు ఓవరాక్షన్ చేశారన్నారు. గవర్నర్ ప్రసంగం ముగిశాక కాంగ్రెస్ సభ్యులు హెడ్‌ఫోన్ విసిరితే తన కంటికి తగిలిందన్నారు. గతంలో ఎప్పుడూ ఇలాంటి ఘటనలు జరిగిన దాఖలాలు లేవన్నారు. అసెంబ్లీలో ప్రతిపక్షాలు ప్రజా సమస్యలపై అధికార పక్షాన్ని ప్రశ్నలతో నిలదీయాలని, ప్రజా సమస్యల పరిష్కారానికి పూనుకోవాలే కానీ.. దాడులకు దిగడం మంచి సంప్రదాయం కాదని సూచించారు.