సోమవారం, 6 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By pnr
Last Updated : సోమవారం, 2 అక్టోబరు 2017 (15:01 IST)

పూటకో పార్టీ మారడానికి నేను గుత్తాను కాదు.. : కోమటిరెడ్డి

నల్గొండ ఎంపీ, సీనియర్ నేత సుఖేందర్ రెడ్డిపై ఆ పార్టీ సీనియర్ నేత, ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మరోమారు మాటలు తూటాలు పేల్చారు. పూటకో పార్టీ మారడానికి నేను గుత్తా సుఖేందర్ రెడ్డిని కాదంటూ వ్యంగ్య

నల్గొండ ఎంపీ, సీనియర్ నేత సుఖేందర్ రెడ్డిపై ఆ పార్టీ సీనియర్ నేత, ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మరోమారు మాటలు తూటాలు పేల్చారు. పూటకో పార్టీ మారడానికి నేను గుత్తా సుఖేందర్ రెడ్డిని కాదంటూ వ్యంగ్యంగా అన్నారు. 
 
గత కొంతకాలంగా టీ కాంగ్రెస్ నేతలపై విమర్శలు గుప్పిస్తున్న కోమటిరెడ్డి సోమవారం మాట్లాడుతూ... తనకు పీసీసీ అధ్యక్ష పదివి ఇచ్చినా.. ఇవ్వకున్నా.. కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతానని స్పష్టం చేశారు. 
 
నల్గగొండ పార్లమెంట్ స్థానానికి జరగనున్న ఉప ఎన్నికల్లో ప్రభుత్వానికి తగిన బుద్ధి చెబుతామన్నారు. ఉన్న ఏడాది కాలమైనా మంచి పాలన అందించాలని ప్రభుత్వానికి సూచించారు. ఆ తర్వాత ఎలాగో కాంగ్రెస్ అధికారంలోకి వస్తుందని కోమటి రెడ్డి జోస్యం చెప్పారు. 
 
కేసీఆర్ ప్రజావ్యతిరేక విధానాలను పాటిస్తున్నారని విమర్శించారు. వాటి గురించి ప్రజల్లోకి వెళ్లి వివరిస్తామని ఈ సందర్భంగా కోమటి రెడ్డి పేర్కొన్నారు. ఇక పీసీసీ అధ్యక్ష పదవి ఇవ్వకుంటే కోమటి రెడ్డి బ్రదర్స్ బీజేపీలోకి వెళ్తారనే ప్రచారం జరుగుతున్న సమయంలో ఆయన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి.