సంబంధిత వార్తలు
- వంగవీటి రంగా భార్య, బిడ్డ రంగుపై వర్మ కామెంట్స్... స్వర్గంలో బ్రేక్ డ్యాన్స్ చేస్తుంటారట...
- కాంగ్రెస్ను వీడి తప్పు చేశా.. టీడీపీలో నేను వలసపక్షిని...
- బట్టలు వేసుకోనివారు మాట్లాడే మాటలు పట్టించుకోనక్కర్లేదు... రోజాపై ఆది సంచలన కామెంట్స్
- రోజా.. నీ క్యారెక్టర్ ఏంటో చెప్పమంటావా? టీడీపీ ఎమ్మెల్సీ ఆదిరెడ్డి
- పవన్ కళ్యాణ్ వారిస్తున్నా ఎగబడటం అభిమానం అంటారా? తమ్మారెడ్డి ప్రశ్న
ఆయనే కొనసాగితే తెలంగాణలో కాంగ్రెస్ భూస్థాపితం... కోమటిరెడ్డి
తెలంగాణలో తెలంగాణ పీసీసి అధ్యక్షుడుగా ఉత్తమ్ కుమార్ రెడ్డి కొనసాగితే 2019 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఐదారు సీట్లు కూడా రావనీ, కాంగ్రెస్ పార్టీ భూస్థాపితం అయిపోతుందని ఆ పార్టీ సీనియర్ నాయకుడు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఆరోపించారు. ఉత్తమ్ కుమార్ రెడ్
తెలంగాణలో తెలంగాణ పీసీసి అధ్యక్షుడుగా ఉత్తమ్ కుమార్ రెడ్డి కొనసాగితే 2019 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఐదారు సీట్లు కూడా రావనీ, కాంగ్రెస్ పార్టీ భూస్థాపితం అయిపోతుందని ఆ పార్టీ సీనియర్ నాయకుడు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఆరోపించారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి కరడుగట్టిన సమైక్యవాది కిరణ్ కుమార్ రెడ్డికి కుడిభుజం అనీ, అలాంటివాడు తెలంగాణ కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షుడుగా వుంటే ఇక పార్టీ ఎలా గెలుస్తుందని ప్రశ్నించారు.
తనను ఎన్నో అవమానాలకు గురిచేసినా పార్టీ కోసం పనిచేస్తున్నట్లు చెప్పుకొచ్చారు. తనను పొమ్మనలేక పొగబెడుతున్నారనీ, ఇదంతా అధిష్టానం దృష్టికి తీసుకువెళ్లినట్లు చెప్పుకొచ్చారు. ఉత్తమకుమార్ రెడ్డే 2019 ఎన్నికల దాకా కొనసాగితే తాము పార్టీలో కొనసాగేది లేదని తేల్చి చెప్పారు. తామే కాదు.. చాలామంది కాంగ్రెస్ పార్టీని విడిచి వెళ్లిపోతారని వార్నింగ్ ఇచ్చారు. ఇప్పటికైనా అధిష్టానం తెలంగాణ పీసీసి అధ్యక్షుడిని మార్చి పార్టీని బతికించుకోవాలని అన్నారు.
