మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. గుసగుసలు
Written By pnr
Last Updated : శనివారం, 5 ఆగస్టు 2017 (13:04 IST)

పవన్ కళ్యాణ్ వారిస్తున్నా ఎగబడటం అభిమానం అంటారా? తమ్మారెడ్డి ప్రశ్న

తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన దర్శకనిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ మరోమారు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ దఫా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌ ఫ్యాన్స్‌ను లక్ష్యంగా చేసుకుని ఈ వ్యాఖ్యలు చేశారు.

తెలుగు చిత్ర పరిశ్రమకు చెందిన దర్శకనిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ మరోమారు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ఈ దఫా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌ ఫ్యాన్స్‌ను లక్ష్యంగా చేసుకుని ఈ వ్యాఖ్యలు చేశారు.  
 
ఇదే అంశంపై ఆయన మాట్లాడుతూ... ఒకప్పుడు ఉండే ఫ్యాన్స్ ఇప్పుడు లేరన్నారు. ఒకప్పుడు రాజకీయ నాయకుల అభిమానులైనా, సినీ నటుల అభిమానులైనా తమ అభిమాన నేత లేదా హీరో ఏదైనా చెబితే దానిని జవదాటే వారు కాదని, ఇతరులను జవదాటనిచ్చేవారు కాదన్నారు. 
 
కానీ, ఇప్పుడు అలాంటి అభిమానులు ఎక్కడా కనిపించరన్నారు. ముఖ్యంగా.. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ వారిస్తున్నా, వద్దని ప్రాధేయపడుతున్నా ఆయనపైబడి ఫోటోలు దిగేందుకు ఉత్సాహం చూపేవారు ఇప్పుడు అభిమానులని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. 
 
ఇప్పటివారికి తమ అభిమాన హీరో అన్నా, అభిమాన నేత అన్నా గౌరవం లేదన్నారు. అలాంటి అభిమానులు ఉంటే ఎంత ఉండకపోతే ఎంత అని ఆయన ఎద్దేవా చేశారు. గతంలో రాజకీయాల్లోకి వచ్చిన సినీ నటులంతా ప్రజల్లోకి చొచ్చుకువెళ్లడం ద్వారానే నిజమైన హీరోలుగా మారారని ఆయన గుర్తు చేశారు.