శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By chj
Last Modified: బుధవారం, 7 మార్చి 2018 (21:50 IST)

70 ఏళ్ల వయసులో కూడా సీఎం బాబు ఢిల్లీకి 29 సార్లు వెళ్లారు... ఎమ్మెల్యే అప్పలనాయుడు

అమరావతి : రాష్ట్రానికి ప్రత్యేక హాదా ఇవ్వాలన్నదే తమ డిమాండ్ అని గజపతినగరం శాసనసభ్యుడు డాక్టర్ కొండపల్లి అప్పలనాయుడు స్పష్టం చేశారు. శాసనసభ ప్రాంగణంలోని మీడియా పాయింట్ వద్ద బుధవారం ఉదయం ఆయన మాట్లాడారు. రాష్ట్రాభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని గతంలోనే తా

అమరావతి : రాష్ట్రానికి ప్రత్యేక హాదా ఇవ్వాలన్నదే తమ డిమాండ్ అని గజపతినగరం శాసనసభ్యుడు డాక్టర్ కొండపల్లి అప్పలనాయుడు స్పష్టం చేశారు. శాసనసభ ప్రాంగణంలోని మీడియా పాయింట్ వద్ద బుధవారం ఉదయం ఆయన మాట్లాడారు. రాష్ట్రాభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని గతంలోనే తాము శాసనసభలో ప్రత్యేక హోదాపై తీర్మానం చేసి కేంద్రానికి పంపినట్లు తెలిపారు. 
 
70 ఏళ్ల వయసులో కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్రాభివృద్ధికి నిరంతరం కృషి చేస్తున్నారని, 29 సార్లు ఢిల్లీ వెళ్లి విభజన హామీలు అమలు చేయమని కోరినా కేంద్రం పట్టించుకోలేదన్నారు. తమ ప్రధాన డిమాండ్ ప్రత్యేక హోదా అని, తమ ఎంపీలు పార్లమెంట్‌లో దీనికోసమే పోరాటం చేస్తున్నారని డాక్టర్ అప్పలనాయుడు చెప్పారు.