పాచిపోయిన లడ్డూలు కూడా ఇంకారాలేదు బ్రదర్ : పవన్ కళ్యాణ్
ఒకనొక సందర్భంలో ప్రత్యేక ప్యాకేజీపై తాను చేసిన పాచిపోయిన లడ్డూలను కూడా బంగారంగా స్వీకరిస్తామని టీడీపీ నేతలు బాహాటంగా ప్రకటించారనీ, కానీ ఇప్పటికీ ఆ పాచిపోయిన లడ్డూలు కూడా రాలేదని జనసేన పార్టీ అధినేత పవ
ఒకనొక సందర్భంలో ప్రత్యేక ప్యాకేజీపై తాను చేసిన పాచిపోయిన లడ్డూలను కూడా బంగారంగా స్వీకరిస్తామని టీడీపీ నేతలు బాహాటంగా ప్రకటించారనీ, కానీ ఇప్పటికీ ఆ పాచిపోయిన లడ్డూలు కూడా రాలేదని జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు.
రాష్ట్ర విభజన హామీలపై జనసేన ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సంయుక్త నిజనిర్ధారణ కమిటీ తుది నివేదికను తయారు చేసింది. ఈ నివేదికలోని అంశాలను శనివారం సాయంత్రం పవన్ కళ్యాణ్ మీడియాకు వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, తన తిరుపతి పర్యటనలో ప్రత్యేక హోదా స్థానంలో ప్రత్యేక ప్యాకేజీ ఓ పాచిపోయిన లడ్డూలతో సమానమని వ్యాఖ్యానించినట్టు తెలిపారు.
అపుడు టీడీపీ నేతలు మాట్లాడుతూ, రాష్ట్ర ప్రజల కోసం ఆ పాచిపోయిన లడ్డూలనే తీసుకునేందుకు సిద్ధంగా ఉన్నట్టు ప్రకటించారు. కానీ, ఆ లడ్డూలను కూడా ఇంతవరకు రాలేదని ఆయన వ్యంగ్యంగా అన్నారు. అదేసమయంలో రాష్ట్ర విభజన వల్ల ఏ ఒక్క రాజకీయ నేతకు ఎలాంటి ఇబ్బందులు రాలేదన్నారు. కానీ, ప్రజలు మాత్రం నానా అవస్థలు పడుతున్నారని గుర్తు చేశారు.
గత ఎన్నికల సమయంలో విభజన వల్ల తీవ్రంగా అన్యాయం చేసిన ఏపీని అన్ని విధాలుగా న్యాయం చేస్తామని బీజేపీ నేతలు హామీ ఇవ్వడం వల్లే తాను ఎన్డీయే కూటమిని మద్దతు ప్రకటించి, ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నట్టు చెప్పారు. ఆ ఎన్నికల్లో బీజేపీ గెలిచాక నిజంగా రాష్ట్రానికి న్యాయం చేస్తుందని గట్టిగా విశ్వసించానని చెప్పారు. కానీ, నాలుగేళ్ళు పూర్తయినా ఒక్క పని చేయకపోగా, పాచిపోయిన లడ్డూలు కూడా ఇంకా రాష్ట్రానికి రాలేదని పవన్ కళ్యాణ్ వ్యాఖ్యానించారు.