శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By TJ
Last Modified: శుక్రవారం, 2 మార్చి 2018 (18:28 IST)

ప్రధానికి పవన్ కళ్యాణ్‌ లేఖ... సమాధానం ఇవ్వకుంటే?

పవన్ కళ్యాణ్‌ ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కమిటీ జెఎఫ్‌సి. ఎపికి ప్రత్యేక హోదా ఇవ్వకుండా కేంద్రం సైలెంట్‌గా ఉండటం, ఎన్నికలకు ముందు ప్రధాని ఆంధ్రకు ఇచ్చిన హామీలు ఇవన్నీ తెలుసుకునేందుకు జెఎఫ్‌‌సిని ఏర్పాటు చేశారు పవన్ కళ్యాణ్‌. ఇది అందరికీ తెలిసిందే. జెఎఫ

పవన్ కళ్యాణ్‌ ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన కమిటీ జెఎఫ్‌సి. ఎపికి ప్రత్యేక హోదా ఇవ్వకుండా కేంద్రం సైలెంట్‌గా ఉండటం, ఎన్నికలకు ముందు ప్రధాని ఆంధ్రకు ఇచ్చిన హామీలు ఇవన్నీ తెలుసుకునేందుకు జెఎఫ్‌‌సిని ఏర్పాటు చేశారు పవన్ కళ్యాణ్‌. ఇది అందరికీ తెలిసిందే. జెఎఫ్‌‌సిలో జయప్రకాష్‌ నారాయణ్, ఉండవల్లి అరుణ్‌ కుమార్ కూడా ఉన్నారు. ఇప్పటికే రెండుసార్లు సమావేశమైన ఈ కమిటీ కేంద్రప్రభుత్వం ఎపికి ఇచ్చిన హామీలేవీ నెరవేర్చలేదని ఒక అభిప్రాయానికి వచ్చింది.
 
20 పేజీలలో కేంద్రం ఎపికి ఇచ్చిన హామీలను పవన్ కళ్యాణ్‌ ఇప్పటికే సిద్ధం చేశారు. తన కమిటీలోని వారందరూ కలిసి కూర్చుని మొత్తం చర్చించి కేంద్రంపై ఒక లేఖను వదలనున్నారు. స్వయంగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఎపికి ఇచ్చిన హామీలు.. నెరవేర్చని తీరును స్పష్టంగా పవన్ కళ్యాణ్‌ ఆ లేఖలో రాయనున్నారు. 
 
మొత్తం 20 పేజీల లేఖను ప్రధానికి స్వయంగా పంపనున్నారు. ఈ హామీలను ఎప్పటిలోగా నెరవేరుస్తారో చెప్పాలని కూడా అందులో స్పష్టంగా రాశారు. ఒకవేళ సమాధానం రాకుంటే మాత్రం ఏ విధంగా ముందుకెళ్ళాలో కూడా ఒక నిర్ణయానికి పవన్ కళ్యాణ్‌ వచ్చినట్లు తెలుస్తోంది. మొత్తంమీద పవన్ ప్రధానికి లేఖ రాయనుండటం మాత్రం తీవ్ర చర్చకు దారితీస్తోంది.