బంగారంతో చేయించిన మాస్కు వేశాడు, ఎంతో తెలిస్తే షాకే...
బంగారం మాస్కు ధరించాడు
ఇక అసలు విషయానికి వస్తే పుణె జిల్లాలోని పింప్రీ-చింద్వాడకు చెందిన శంకర్ కురాడే రొటీన్ మాస్కులకు బదులు వెరైటీగా మాస్కు చేయించుకోవాలనుకున్నాడు. అసలే అతడికి బంగారంతో చేయించిన ఆభరణాలు అంటే మహాపిచ్చి, మెడలో, చేతులకు కావల్సిన మోతాదులో బంగార నగలు ధరిస్తుంటాడు. కాబట్టి మాస్కు కూడా బంగారంతో చేయించుకోవాలనుకున్నాడు. అనుకున్నదే తడవుగా వెంటనే బంగారు నగల దుకాణాలను సంప్రదించాడు.
మాస్కుకు అయ్యే ఖర్చు ఏడెనిమిది లక్షల దాటుతుందని చెప్పగా చివరికి ఓ బంగారం నగల షాపువారితో రూ. 2 లక్షల 89 వేల ఖరీదైన గోల్డెన్ మాస్క్‌ను తయారు చేయించుకున్నాడు. ఐదున్నర తులాల బంగారం వాడిన ఈ మాస్కును ధరించిన శంకర్ దాన్ని సోషల్ మీడియాలో వదిలాడు. ఇకనేం అది కాస్తా ట్రెండింగ్ అయింది. మరో విషయం ఏంటంటే... శంకర్ రోజూ 3 కిలోల బరువుండే బంగారు గొలుసులు, ఉంగరాలు తదితర ఆభరణాలు ధరిస్తాడట.
