సంబంధిత వార్తలు
- స్కూల్స్, కాలేజీలు మూసేయండి : సిఎంకు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ లేఖ
- కరోనా రోగుల నుంచి ఎక్కువ ఫీజులు వసూలు చేస్తే చర్యలు: జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు
- ఓట్లు ఎలా అడగాలో తెలియక అవాకులు చెవాకులు పేలుతున్నారు... : ఆదిమూలపు
- 8వ తరగతి వరకూ స్కూళ్లు బంద్... ఎక్కడ?
- పంజాబ్‌లో మార్చి 31వరకు స్కూళ్లు మూత
ఆన్‌లైన్ క్లాసులే అయితే పాఠశాలలు ఫీజులు తగ్గించాల్సిందే: సుప్రీంకోర్టు
సాధారణ స్కూలు తరగతులతో పోలిస్తే ఆన్‌లైన్ క్లాస్‌ల నిర్వహణ తల్లిదండ్రులకు భారంగా మారిందని సుప్రీం కోర్టు పేర్కొంది. కరోనా కారణంగా గతేడాది నుంచి స్కూళ్లన్నీ ఆన్‌లైన్ క్లాస్‌లు నిర్వహిస్తున్న తరుణంలో స్కూళ్లకు ఇంకా ఖర్చు తగ్గిందని సుప్రీం పేర్కొంది.
కొవిడ్ కారణంగా విద్యార్థుల తల్లిదండ్రులు పడిన ఇబ్బందులను స్కూలు యాజమాన్యాలు అర్థం చేసుకోవాలని, ఆమేరకు వారికి ఉపశమనం కలిగించాలని ఆదేశించింది.
విద్యార్థులకు అందించని వసతులకు కూడా ఫీజులు వసూలు చేయడం లాభార్జనే అవుతుందని, అది మానుకోవాలని హితవు పలికింది. ఇక గతేడాది లాక్‌డౌన్ కారణంగా చాలా కాలం స్కూళ్లు తెరవలేదు.
దీని కారణంగా పెట్రోల్/డీజిల్, కరెంటు, నిర్వహణ ఖర్చు, నీటి ఛార్జీలు, స్టేషనరీ ఛార్జీలు వంటివి మిగిలిపోయాయి. వీటిని కూడా దృష్టిలో ఉంచుకోవాలి అని సుప్రీం ధర్మాసనం స్పష్టం చేసింది.
తర్వాతి కథనం
