శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By ఎం
Last Updated : శనివారం, 17 ఏప్రియల్ 2021 (20:23 IST)

స్కూల్స్‌, కాలేజీలు మూసేయండి : సిఎంకు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ లేఖ

కరోనా రెండో దశ వ్యాప్తి నేపథ్యంలో రాష్ట్రంలోని స్కూల్స్‌, కాలేజీలు మూసివేసేందుకు చర్యలు చేపట్టాలని సిఎం వైఎస్‌ జగన్‌ను సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ కోరారు.

ఈ మేరకు ఆయనకు శనివారం లేఖ రాశారు. రాష్ట్ర వ్యాప్తంగా 24 గంటల్లో ఏడు వేలకు పైగా కరోనా కేసులు నమోదవుతున్నాయని తెలిపారు.

ముఖ్యంగా వివిధ జిల్లాల్లోని స్కూల్స్‌, కాలేజీల్లో ఉపాధ్యాయులు, సిబ్బంది, విద్యార్థులకు వైరస్‌ వేగంగా వ్యాపిస్తోందని పేర్కొన్నారు.

కేంద్రం, తెలంగాణ ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయాలను దృష్టిలో పెట్టుకుని వైరస్‌ వ్యాప్తి తగ్గే వరకూ ఎపిలో పాఠశాలలు, కాలేజీలను మూసివేసేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు.