కేంద్రీయవిద్యాలయాల్లోప్రవేశాలకు నోటిఫికేషన్
అధునాతన, సాంకేతిక విద్యా బోధనకు వేదికలైన కేంద్రీయ విద్యాలయాల్లో (కేవీ) ప్రవేశాలకు వేళయ్యింది. కొవిడ్ నేపథ్యంలో ఈ ఏడాది ప్రక్రియ కొంత ఆలస్యమైంది.
2021-22 విద్యా సంవత్సరానికి వచ్చే నెల 1 నుంచి మే 31వ తేదీకి ఇంటర్మీడియట్ మినహాయించి మిగిలిన అన్ని తరగతుల్లో ప్రవేశాలు పూర్తి చేసేందుకు ఆదివారం కేంద్రీయ విద్యాలయ సంఘటన్ నోటిఫికేషన్ విడుదల చేసింది.
ఒకటో తరగతిలో చేరితే ఇంటర్మీడియట్ వరకు చదువుకోవచ్ఛు దీంతో సీట్లు పొందేందుకు ఏటా విపరీతమైన పోటీ ఉంటుంది.
ఖాళీలు పదుల సంఖ్యలో ఉంటే దరఖాస్తులు వందలు, వేలల్లో వస్తున్నాయి. కృష్ణా జిల్లాలో మూడు విద్యాలయాలు ఉండగా విజయవాడలో రెండు, మరొకటి మచిలీపట్నంలో ఉంది.
దరఖాస్తు గడువు :
ఒకటో తరగతిలో ప్రవేశాలకు వచ్చే నెల 1వ తేదీ ఉదయం 10 గంటలకు ప్రారంభమై 19వ తేదీ సాయంత్రం 7 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తుకు అవకాశం ఉంది.
రెండో తరగతి నుంచి తొమ్మిదో తరగతి వరకు ఖాళీలను వచ్చే నెల 8వ తేదీ నుంచి 15వ తేదీలోపు ఆఫ్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరిస్తారు. సీబీఎస్‌ఈ పదో తరగతి ఫలితాలు వెల్లడైన 30 రోజుల్లోపు ఇంటర్మీడియెట్‌లో ఖాళీలను భర్తీ చేస్తారు
వయో పరిమితి : ఒకటో తరగతిలో ప్రవేశానికి 2021 మార్చి 31వ తేదీకి ఐదేళ్లు నిండి ఉండాలి. ఐదు నుంచి ఏడేళ్లలోపు వారికి మాత్రమే ప్రవేశం ఉంటుంది.