శనివారం, 11 జనవరి 2025
  1. వార్తలు
  2. కెరీర్
  3. కెరీర్ వార్తలు
Written By ఎం
Last Updated : గురువారం, 11 మార్చి 2021 (10:10 IST)

మార్చి 12 నుంచి తితిదే డిగ్రీ క‌ళాశాల‌ల్లో స్పాట్ అడ్మిష‌న్లు

తితిదే ఆధ్వర్యంలో నడుస్తున్న శ్రీ ప‌ద్మావ‌తి డిగ్రీ క‌ళాశాల‌, శ్రీ గోవింద‌రాజ‌స్వామి ఆర్ట్స్ క‌ళాశాల‌, శ్రీ వేంక‌టేశ్వ‌ర ఆర్ట్స్ కళాశాలల్లో 2020-21 విద్యా సంవత్సరంలో ప్ర‌వేశానికిగాను మిగిలిన సీట్ల కోసం మార్చి 12 నుండి 20వ తేదీ వ‌ర‌కు ఆయా క‌ళాశాల‌ల్లో స్పాట్ అడ్మిష‌న్లు నిర్వ‌హించ‌నున్న‌ట్టు విద్యా విభాగం డెప్యూటీ ఈవో గోవింద‌రాజ‌న్ బుధ‌వారం ఒక ప్ర‌క‌ట‌న‌లో తెలిపారు. హాస్ట‌ల్ సీట్లు క‌ల్పించ‌బ‌డ‌వ‌ని, స్థానికుల‌కు ప్రాధాన్య‌త ఉంటుంద‌ని వివ‌రించారు.
 
ఇదివ‌ర‌కే http://oamdc.ap.gov.in ద్వారా ద‌ర‌ఖాస్తు చేసుకున్న విద్యార్థుల‌కు మొద‌టి, రెండు, మూడో విడ‌తల్లో ఆన్‌లైన్ ద్వారా కౌన్సెలింగ్ నిర్వ‌హించి సీట్లు భ‌ర్తీ చేశారు. మిగిలిన సీట్ల‌ను భ‌ర్తీ చేసేందుకు స్పాట్ అడ్మిష‌న్లు నిర్వ‌హించ‌నున్నారు. 
 
మార్చి 12 నుండి 20వ తేదీ వ‌ర‌కు ప‌ద్మావ‌తి డిగ్రీ క‌ళాశాల‌, గోవింద‌రాజ‌స్వామి ఆర్ట్స్ క‌ళాశాల‌ల్లో ఉద‌యం 9 గంట‌ల నుండి స్పాట్ అడ్మిష‌న్లు నిర్వ‌హిస్తారు. అదేవిధంగా, మార్చి 15 నుండి 20వ తేదీ వ‌ర‌కు శ్రీ వేంక‌టేశ్వ‌ర ఆర్ట్స్ కళాశాలలో ఉద‌యం 9 గంట‌ల నుండి స్పాట్ అడ్మిష‌న్లు చేప‌డ‌తారు.
 
క‌ళాశాల సీట్లు మాత్ర‌మే కావాల్సిన విద్యార్థులు సంబంధిత ధ్రువీక‌ర‌ణ‌ప‌త్రాలు, ఫీజుల‌తో నేరుగా సంబంధిత డిగ్రీ క‌ళాశాల‌లో స్పాట్ అడ్మిష‌న్లకు హాజ‌రుకావాల‌ని కోరడ‌మైన‌ది.