1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. ట్రెండింగ్
  4. The internet is concerned about this video of an elephant

యువతితో కలిసి ఏనుగు డ్యాన్స్.. నెట్టింట వీడియో వైరల్

Elephant
Elephant
ఉత్తరాఖండ్‌లో ఓ యువతితో కలిసి ఏనుగు డ్యాన్స్ చేస్తున్న వీడియో వైరల్‌ అవుతోంది. జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్ ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఉంది. ఈ పార్కులో అనేక వన్యప్రాణులు పెంచబడతాయి. 
 
ఈ పార్కును సందర్శించిన వైష్ణవి అనే మహిళ ఏనుగు ముందు డ్యాన్స్ చేసింది. ఇది చూసిన ఏనుగు కూడా ఆమె నృత్యానికి ధీటుగా తన శరీరాన్ని ఊపుతూ నృత్యం చేసింది. దీనిని ఎవరో వీడియో తీశారు. 
 
వైష్ణవి నాయక్ ఈ వీడియోను నేపథ్య సంగీతంతో తన ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకున్నారు. ఇది సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అయితే ఇలాంటి ఘటనలు ఇబ్బందులకు గురిచేయవచ్చునని నెటిజన్లు హెచ్చరిస్తున్నారు.
About Writer
సెల్వి
తర్వాతి కథనం
సీఎం జగన్ యూరప్ పర్యటనకు సీబీఐ కోర్టు అనుమతి