శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 17 ఏప్రియల్ 2023 (13:55 IST)

వైకాపా నేతలకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన పవన్ కల్యాణ్ (video)

Pawan kalyan
Pawan kalyan
పవర్ స్టార్, జనసేన అధినేత పవన్ కల్యాణ్ వైకాపా నేతలకు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. తెలంగాణ ప్రజలను ఉద్దేశించి మంత్రులు చేసిన వ్యాఖ్యలపై సీరియస్ అయ్యారు. వెంటనే వైకాపా మంత్రులు ప్రజలకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. 
 
తాజాగా బిఆర్ఎస్ మంత్రి హరీష్ రావు.. ఏపీలో ప్రభుత్వ తీరు, అభివృద్ధిపై పలు వ్యాఖ్యలు చేశారు. దీంతో వైస్సార్సీపీ నేతలు హరీష్ రావుతో పాటు తెలంగాణ ప్రజలను ఉద్దేశించి అతి దారుణ వ్యాఖ్యలు చేశారు. వీరి మాటలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో తెలంగాణ ప్రజలు వైకాపా నేతలు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. 
 
ఈ నేపథ్యంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వైకాపా మంత్రులపై ఫైర్ అయ్యారు. హరీశ్ రావు ఏ ఉద్దేశంతో ఆ వ్యాఖ్యలు చేశారో తనకు తెలియదని… కానీ, ఏపీ మంత్రులు స్పందించిన తీరు మాత్రం దురదృష్ణకరమని పవన్ చెప్పారు.  ఒక జాతిని అవమానించేలా ఏపీ మంత్రులు మాట్లాడుతుంటే వైస్సార్సీపీ సీనియర్ నేతలు ఏం చేస్తున్నారని పవన్ ప్రశ్నించారు.