సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 15 ఏప్రియల్ 2023 (10:37 IST)

అకీరానందన్ సినీ ఎంట్రీ.. హీరోగా కాదు.. మ్యూజిక్ డైరక్టర్‌గా...

Akira Nandan
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ వారసుడు అకీరా నందన్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చాడు. అయితే హీరోగా కాదు.. మ్యూజిక్ డైరక్టర్‌గా. కార్తీకేయ యార్లగడ్డ దర్శకత్వం వహించిన ఈ షార్ట్ ఫిల్మ్‌కు అద్భుతమైన సంగీతాన్ని అందించాడు. 
 
ఒక రచయిత ఎలాంటి సమస్యలను ఎదుర్కొన్నాడు. వాటిని ఆయన ఎలా ఎదుర్కొన్నాడనే కథాంశంతో ఈ వెబ్‌సిరీస్‌ను నిర్మించారు. అభిలాష్ సుంకర, మనోజ్ రిషి ప్రధాన పాత్రలను పోషించారు. ఫణి మాధవ్ సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరించారు.
 
ఈ సందర్భంగా హీరో అడివి శేష్ స్పందిస్తూ.. అకీరా అంటే తనకు చాలా ఇష్టమని చెప్పారు. షార్ట్ ఫిల్మ్ లింక్‌ను షేర్ చేస్తూ, టీమ్‌కు ఆల్ ది బెస్ట్ చెప్పాడు. అకీరా మ్యూజిక్ అందించడం పట్ల హర్షం వ్యక్తం చేశాడు.