సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By వరుణ్
Last Updated : బుధవారం, 12 ఏప్రియల్ 2023 (17:58 IST)

పవన్ ఓ శక్తి.. ఆయన తలచుకుంటే ఏదైనా జరుగుతుంది : శివాజీ

sivaji
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఓ శక్తి అని, ఆయన అనుకుంటే ఏదైనా జరిగిపోతుందని సినీ నటుడు శివాజీ అన్నారు. కానీ, ఆయన ఏది అనుకోరన్నారు. తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో శివాజీ మాట్లాడుతూ, జనసేనకు ప్రజల్లో మంచి ఆదరణ ఉంది. వారికంటూ ప్రత్యేక ఓటు బ్యాంకు కూడా ఉంది. ఒక్క మాటలో చెప్పాలంటే పవన్ కళ్యాణ్ ఓ శక్తి. ఆయన అనుకుంటే అయిపోతుంది. కానీ, ఏదీ అనుకోడు. ప్రత్యేక హోదా అవుతుంది. అమరావతి అవుతుంది. విశాఖ ఉక్కు అవుతుంది. కానీ, ఆయన అనుకోడు. ఎందుకు అనుకోడో నాకు అర్థం కాదన్నారు. 
 
అదేసమయంలో తాను జనసేన పార్టీలో చేరాలని లేదున్నారు. మన దగ్గర అస్త్రం ఉన్నపుడు దాన్ని సరిగ్గా ప్రయోగిస్తే దాని పవరేంటో తెలుస్తుందన్నారు. కరెక్ట్ ప్లేస్‌లో కరెక్ట్ టైమ్‌లో సంధించడం లేదనేదే నా బాధ అని అన్నారు. ఇకపోతే, బీజేపీతో కలవడం అనేది పవన్ ఇష్టం. నా అభిప్రాయం ఏంటంటే, పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఒక శక్తి. పార్టీలను నమ్ముకోవడం కంటే ప్రజల పక్షాన నిలబడి, సమస్యలను నమ్ముకుని ఫైట్ చేస్తే ఫలితం మరోలా ఉంటుందన్నారు. 
 
వైఎస్ జగన్ .. వెరీ ఫోకస్డ్ పొలిటీషియన్. దృష్టిసారించారంటే అనుకున్నది సాధిస్తాడు. అదే ఫోకస్ పవన్ కళ్యాణ్ పెట్టడం లేదు. ఇద్దరికీ అదే తేడా అని అభిప్రాయపడ్డారు. జగన్, మోదీతో నాకేం ఫ్యాక్షన్ గొడవలు లేవు. నాకేం పోలీస్ ఉద్యోగం ఇవ్వలేదు వాళ్లపై నిఘా పెట్టడానికి. సమాజం బాగుండాలనే నా తాపత్రయం అంతా అని శివాజీ చెప్పుకొచ్చారు.