ఆదివారం, 2 ఫిబ్రవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By వరుణ్
Last Updated : మంగళవారం, 11 ఏప్రియల్ 2023 (15:04 IST)

ప్రమాదం జరిగినపుడు రక్తం చుక్క కూడా రాలేదు : అల్లు అరవింద్

allu arvind
గతంలో హీరో సాయి ధరమ్ తేజ్ రోడ్డు ప్రమాదానికి గురైయ్యారు. ఆయన బైకుపై వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. దీనిపై టాలీవుడ్ అగ్ర నిర్మాత అల్లు అరవింద్ తాజాగా స్పందించారు. సాయి ధరమ్ తేజ్‌కి యాక్సిడెంట్ అయిందన్న వార్త తెలియగానే తాను హుటాహుటిన ప్రమాదం స్థలానికి చేరుకున్నాను. అపుడు సాయిని చూసి నాకు చాల భయం వేసింది. రక్తం చుక్క కూడా రాలేదు.. ఏం జరిగిందో తెలియడానికి పావుగంట పట్టింది. అంత పెద్ద ప్రమాదం నుంచి అతడు బయటపడినందుకు చాలా ఆనందంగా ఉంది. సాయి ధరమ్ తేజ్ నటించిన తాజా చిత్రం "విరూపాక్ష". ఈ చిత్రం ఆడియో రిలీజ్ వేడుక జరిగింది. ఇందులో పాల్గొన్న అల్లు అరవింద్ ఈ ప్రమాదం గురించి మాట్లాడారు. 
 
ఇకపోతే, సాయిధరమ్‌ తేజ్‌ కూడా తనకు జరిగిన ప్రమాదంపై స్పందించారు. 'యాక్సిడెంట్‌ ప్రభావం సినిమాలపై పడుతుందని కొందరు అనుకున్నారు. అసలు ఆ యాక్సిడెంట్‌ సంగతే నేను మర్చిపోయాను. అది ఒక స్వీట్‌ మెమొరీ కింద లాక్‌ చేసి పెట్టుకున్నా. ఇప్పుడు పూర్తిగా కోలుకున్నా. ఇకపై గ్యాప్ తీసుకోను.. వరసగా సినిమాలు చేస్తాను' అని ఈ యంగ్‌ హీరో చెప్పారు. కార్తీక్‌ దండు దర్శకత్వంలో తెరకెక్కిన 'విరూపాక్ష'లో సంయుక్త హీరోయిన్‌గా నటించగా, ఈ నెల 21వ తేదీన విడుదలకానుంది.