గురువారం, 23 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By వరుణ్

బైక్ ప్రమాదం తర్వాత నోటి మాట పోయింది : సాయి ధరమ్ తేజ్

saidharam tej
బైక్ ప్రమాదం జరిగిన తర్వాత తనకు నోట మాట రాలేదని టాలీవుడ్ మెగా హీరో సాయిధరమ్ తేజ్ అన్నారు. ఆయన నటించిన తాజా చిత్రం "విరూపాక్ష". ఈ నెల 21వ తేదీన ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ నేపథ్యంలో ఈ చిత్రం ప్రమోషన్ కార్యక్రమాల్లో భాగంగా ఆయన మాట్లాడుతూ, బైక్ ప్రమాదం జరిగిన తర్వాత ఆ షాక్‌తో నాకు మాట పడిపోయింది. మాట పడిపోయిన తర్వాత నాకు మాట విలువ తెలిసింది. ఎప్పటిలా మాట్లాడలనే తపన ఎంతగానో ఉండేది. ఆ సమయంలో మాట్లాడటానికి ఎంతగా ప్రయత్నం చేశానో.. ఎంతలా కష్టపడ్డానో నాకు మాత్రమే తెలుసన్నారు. 
 
పైగా, ఈ ప్రమాదం జరగడానికి ముందు రిబబ్లిక్ సినిమాలో నాలుగు పేజీల డైలాగ్‌ను అనర్గళంగా ఏకధాటిగా చెప్పాను. కానీ విరూపాక్ష సినిమా షూటింగులో మాత్రం అరపేజీకి మించి చెప్పలేకపోయాను. ఇందుకోసం నానా అవస్థలు పడ్డాను. కానీ తోటి ఆర్టిస్టులు, చిత్ర బృందం సభ్యులు ఎంతగానో సహకరించారు. కొన్నిసార్లు కేవలం పెదాలను మాత్రమే కదిలించాను. ప్రమాదం తర్వాత హీరోగా నా జర్నీ మొదటి మెట్టు నుంచి మొదలుపెట్టినట్టుగానే ఉంది అని చెప్పుకొచ్చారు.