శనివారం, 28 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 23 జూన్ 2022 (13:39 IST)

ఘట్‌కేసర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం... ముగ్గురి మృతి

road accident
హైదరాబాద్ నగర శివారు ప్రాంతమైన ఘట్‌కేసర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ముగ్గురు దుర్మరణం పాలయ్యారు. ఘట్‌కేసర్ పరిధిలోని అవుషాపూర్ వద్ద వరంగల్ జాతీయ రహదారిపై గురువారం ఉదయం ఈ ప్రమాదం సంభవించింది. ఈ రహదారిపై వెళుతున్న ద్విచక్రవాహనాన్ని గుర్తు తెలియని వాహనం ఒకటి ఢీకొట్టింది. దీంతో ఓ యువతి, ఇద్దరు యువకులు ప్రాణాలు కోల్పోయారు. 
 
ఈ ప్రమాదంపై స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు... మృతదేహాలను స్వాధీనం చేసుకుని ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు. అయితే, మృతుల వివరాలతో పాటు.. ప్రమాదానికి కారణమైన వాహనం వివరాలు తెలియాల్సివుంది.