గురువారం, 23 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By ఠాగూర్

ఇంట్లోకి వెళ్లి లాక్ చేసుకుంది.. తర్వాత ఏం జరిగిందంటే.. ప్రత్యూష మృతిపై వాచ్‌మెన్ భార్య

prathyusha
హైదరాబాద్ నగరానికి చెందిన ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ ప్రత్యూష గరిమెళ్ల శనివారం తన ఇంట్లోనే ఆత్మహత్య చేసుకున్నారు. దీనిపై అనేక మంది దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తున్నారు. అయితే, రెండు నెలల క్రితం ప్రత్యూష ఇంటి వాచ్‌మెన్‌గా ఓ దంపతుల జంట చేరింది. వీరిలో భర్త వాచ్‌మెన్‌గా ఉంటే, ఆయన భార్య ప్రత్యూష ఇంట్లో పనులు చేసేది. 
 
ఇపుడు తమ యజమానురాలు ప్రత్యూష మృతిపై వాచ్‌మెన్ భార్య స్పందించారు. ఆత్మహత్యకు ముందు ఆమె గదిలోకి వెళ్లి డోర్ లాక్ చేసుకున్నారని చెప్పారు. పైగా, ప్రత్యూష వ్యక్తిగత జీవితం, వారి కష్టాలు, ఇతర వివరాలను తమకు తెలియవన్నారు. 
 
అయితే, ఢిల్లీలో ఉండే ప్రత్యూష తల్లిదండ్రులు అపుడపుడూ వచ్చి చూసి వెళ్లేవారని చెప్పింది. అలాగే, తాను ఆమెను ఎలా కలిసింది, తదితర వివరాలను కూడా వాచ్‌మెన్ భార్య వివరించారు.