సోమవారం, 27 జనవరి 2025
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : శనివారం, 11 జూన్ 2022 (08:13 IST)

జూబ్లీహిల్స్ బాలిక అత్యాచారం.. మెడపై గోళ్లతో రక్కి.. రాక్షసంగా ప్రవర్తించారు..

gang rape
హైదరాబాద్ జూబ్లీహిల్స్ మైనర్ బాలిక అత్యాచారం ఘటనలో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. బాలికపై అత్యాచారానికి పాల్పడ్డ నిందితులు ఆమె పట్ల రాక్షసంగా ప్రవర్తించారని మెడికల్‌ రిపోర్టులో వెల్లడైంది. 
 
బాలికను నమ్మించి కారులో ఎక్కించుకుని తీసుకెళ్లిన నిందితులు కారులో బాలిక మెడపై గోళ్లతో రక్కి గాయాలు చేసినట్లు మెడికల్ రిపోర్టులో వెల్లడైంది. అంతేకాకుండా బాలిక శరీరంపై పలు చోట్ల కూడా గాయాలున్నాయని రిపోర్టులో డాక్టర్లు పేర్కొన్నారు. 
 
కారులో బాలికపై నిందితులు లైంగిక దాడికి పాల్పడేందుకు యత్నించిన సమయంలో ప్రతిఘటించిందని, దాంతో ఆగ్రహించిన నిందితులు ఇష్టానుసారంగా బాలికపై దాడికి దిగినట్లు ఈ రిపోర్ట్ ఆధారంగా పోలీసులు అనుమానిస్తున్నారు.
 
ప్రస్తుతం పోలీసు కస్టడీ విచారణను ఎదుర్కుంటున్న సాదుద్దీన్‌ కొన్ని సమయాలలో బాలికపై జరిగిన అంశాలపై పోలీసులకు సమాచారం ఇస్తున్నా ఇంకొన్ని అంశాలపై మౌనంగా ఉంటున్నాడని తెలిసింది. సాదుద్దీన్‌ రెండవ రోజు విచారణ కొనసాగుతుండగా, శనివారం నుంచి ముగ్గురు మైనర్లను విచారించనున్నారు. ఇప్పటికే ఐదుగురు మైనర్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.