ఆదివారం, 29 డిశెంబరు 2024
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలంగాణ
Written By సెల్వి
Last Updated : శనివారం, 11 జూన్ 2022 (14:44 IST)

ఖమ్మంలో కేటీఆర్ పర్యటన..

ktramarao
తెలంగాణ మంత్రి కేటీఆర్ ఖమ్మంలో పర్యటించనున్నారు. శనివారం ఖమ్మం నగరంలో పర్యటించనున్న సందర్భంగా రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తో కలిసి పలు అభివృద్ధి పనులను ప్రారంభించనున్నారు. మంత్రి పర్యటన సందర్భంగా అధికారులు ఏర్పాట్లు చేశారు.
 
రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు శనివారం ఖమ్మం నగరంలో పర్యటించనున్నారు. రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ తో కలిసి పలు అభివృద్ధి పనులను ప్రారంభించనున్నారు. మంత్రి పర్యటన సందర్భంగా అధికారులు ఏర్పాట్లు చేశారు.
 
మంత్రి కేటీఆర్ తన పర్యటనలో భాగంగా ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని టీఆర్ఎస్ ముఖ్యనేతలు, ప్రజాప్రతినిధులతో సమావేశం కానున్నారు. జిల్లా సమగ్రాభివృద్ధిపై దిశానిర్దేశం చేయనున్నారు.