గురువారం, 30 నవంబరు 2023
  1. వార్తలు
  2. తెలుగు వార్తలు
  3. తెలుగు వార్తలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 2 జూన్ 2022 (09:58 IST)

ఢిల్లీ పర్యటనకు సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి

ys jagan
ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ఢిల్లీ పర్యటనలో భాగంగా గురువారం సాయంత్రం 4.30 గంటలకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో సమావేశం కానున్నారు. 
 
ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై సీఎం జగన్ చర్చించనున్నారు. అనంతరం పలువురు ప్రముఖులతో భేటీ కానున్నారు సీఎం జగన్‌. 
 
ఈ భేటీలో రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై ప్రధానితో సీఎం చర్చించనున్నారు. ముఖ్యంగా, పెండింగ్‌లో ఉన్న నిధులను విడుదల చేయాలని, షెడ్యూల్ 9, 10 కింద జాబితా చేయబడిన ప్రభుత్వ సంస్థలు, కార్పొరేషన్ల విభజనను వేగవంతం చేయాలని ప్రధాని మోడీకి విన్నవించనున్నారు. 
 
అలాగే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక కేటగిరీ హోదా మంజూరు చేసే దీర్ఘకాల వాగ్దానం, దిశ చట్టానికి కేంద్రం ఆమోదం తెలపాలని కోరనున్నారు. అలాగే, రాష్ట్రానికి సంబంధించిన పలు అంశాలపై ప్రధానితో చర్చించనున్నారు.