ఆదివారం, 22 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : బుధవారం, 15 మార్చి 2023 (17:06 IST)

ప్రేమలో ఉన్నపుడు కొన్ని కంట్రోల్ చేసుకుంటాం : రాంగోపాల్ వర్మ

Ram Gopal Varma
ప్రేమలో ఉన్నపుడు కొన్ని విషయాలు కంట్రోల్ చేసుకుంటామని, పెళ్లి పేరుతో ఎపుడైతే ఒక్కటవుతామో అప్పటి నుంచే అన్నీ మారిపోతాయని చెప్పారు. వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ అన్నారు. ఆయన తన వివాహం గురించి తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర విషయాలు వెల్లడించారు. 
 
తనకు రత్నకు వివాహం జరిగిన మూడో రోజు నుంచే గొడవలు మొదలయ్యాయని చెప్పారు. పైగా, తాను ఇంటిపట్టున ఉన్నది చాలా తక్కువ అని చెప్పారు. ఇద్దరి మధ్య గొడవలు జరిగేవన్నారు. ఓ రోజున రత్న నా కాలర్ పట్టుకుని గోడకు అదిమి పట్టేసిందని, అది చూసిన నా నాన్న కంగారుపడిపోయి ఆమెపై బిగ్గరగా అరిచేశారని చెప్పారు. రత్న ఎంతగా అరిచినా తాను పెద్దగా రియాక్ట్ అయ్యేవాడిని కాదన్నారు. 
 
ఒక మనిషి రియాక్ట్ కాకపోతే అవతల వ్యక్తికి మరింత కోపం వస్తుందని అన్నారు. అవతర వ్యక్తి నుంచి రెస్పాన్స్ రావాలనే ఉద్దేశ్యంతో ఫిజికల్‌గా గొడవపడటానికి రెఢీ అవుతారు. రత్న చేసింది కూడా ఇదే. అలాంటపుడు తప్పించుకోవడానికి నేను పారిపోయేవాడిని. ఒకసారి మా బిల్డింగ్ పై నుంచి‌ పైకి దూకేసి మరీ వెళ్లిపోయాను. ఆ రాత్రంతా బంజారా హిల్స్‌‍ రోడ్లపై తిరుగుతూ గడిపేశాను అని రాంగోపాల్ వర్మ చెప్పారు.