సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 25 మార్చి 2023 (10:15 IST)

పవన్, సాయితేజ్ సినిమా రిలీజ్ డేట్.. జూలై 28న రిలీజ్

Pawan kalyan
Pawan kalyan
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ - సాయితేజ్ 'వినోదయా సితం' సినిమా రీమేక్‌లో చేస్తున్నారనే సంగతి తెలిసిందే. విశ్వప్రసాద్ - వివేక్ కూచిభొట్ల నిర్మిస్తున్న ఈ సినిమాకి సముద్రఖని దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమాలో పవన్‌ది ప్రధాన పాత్ర అని అందరూ అనుకున్నారు. 
 
సాయితేజ్ ఒక ముఖ్యమైన పాత్రను చేస్తున్నాడని అంతా అనుకున్నారు. కానీ ఈ కథ అంతా కూడా సాయితేజ్ చుట్టూనే తిరుగుతుందని అంటున్నారు. ఇటీవలే ఈ సినిమా రెగ్యులర్ షూటింగు మొదలైంది. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. జులై 28వ తేదీన ఈ సినిమాను రిలీజ్ చేయనున్నారు.