శనివారం, 28 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 23 మార్చి 2023 (12:48 IST)

పవన్ కళ్యాణ్‌తో కలిసి నటించట్లేదు.. మాళవికా మోహన్

Malavika Mohanan
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌తో కలిసి ఓ సినిమాలో నటిస్తానని వస్తున్న వార్తలను మాళవికా మోహన్ కొట్టిపారేసింది. దర్శకుడు హరీష్ శంకర్ కొత్త చిత్రం "ఉస్తాద్ భగత్ సింగ్"లో పవన్ కళ్యాణ్‌తో కలిసి నటించడానికి ఆమె సైన్ ఇన్ చేసినట్లు వార్తలు వచ్చాయి. మరోవైపు ఆమె తప్పుడు సమాచారాన్ని ఖండిస్తూ ట్విట్టర్‌లో పేర్కొంది. 
 
ప్రస్తుతం దర్శకుడు మారుతీ చిత్రంలో ప్రభాస్ సరసన నటిస్తున్నానని, మరే ఇతర తెలుగు చిత్రాలకు సంతకం చేయలేదని మాళవిక మోహన్ స్పష్టం చేసింది. "పవన్ కళ్యాణ్ సార్ అంటే చాలా అభిమానం ఉంది, కానీ నేను ఈ ప్రాజెక్ట్‌లో భాగం కానని స్పష్టం చేయాలి" అని ఆమె రాసింది.