గురువారం, 23 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : సోమవారం, 17 ఏప్రియల్ 2023 (13:14 IST)

చిరంజీవి, అల్లు అర్జున్‌ తో క్రేజీ ప్రాజెక్ట్‌ రానుందా!

chiru-allu-viswaprasad
chiru-allu-viswaprasad
తెలుగు ఇండస్ట్రీలో అగ్ర నిర్మాత క్రేజీ ప్రాజెక్ట్‌లకు సిద్ధమవుతున్నారు. సాఫ్ట్‌వేర్‌ రంగం నుంచి తెలుగు సినిమారంగంలోకి నిర్మాతగా ప్యాషన్‌తో వచ్చిన టి.జి. విశ్వప్రసాద్‌ పలు విజయవంతమైన సినిమాలు నిర్మించారు. ధమాకా, నిశ్శబ్దం వంటి చిత్రాలు తీసిన ఆయన ఈసారి గోపీచంద్‌ హీరోగా రామబాణం నిర్మించారు. ఇది విడుదలకు సిద్ధమైంది. ఇదేకాకుండా ప్రభాస్‌తోనూ పవన్‌ కళ్యాణ్‌తోనూ సినిమాలు ప్రకటించారు. అవి నిర్మాణదశలో వున్నాయి. పవన్‌ కళ్యాణ్‌ సినిమా టైటిల్‌ త్వరలో ప్రకటిస్తామని తెలియజేస్తున్నారు.
 
ఇదిలా వుండగా, ఇటీవలే విశ్వప్రసాద్‌గారు మెగాస్టార్‌ చిరంజీవిని, అల్లు అర్జున్‌ను కలిశారు. దీనిపై ఆయన స్పందిస్తూ, అన్నీ అనుకూలిస్తే వారితో సినిమా చేయాలనుందని వెల్లడించారు. ఇద్దరితో వేరువేరుగా సినిమానా! కాంబినేషన్‌లో చేస్తామరనేది క్లారిటీ ఇవ్వకపోయినా తెలుగు ఇండస్ట్రీలో క్రేజ్‌ ప్రాజెక్ట్‌ అవుతుందని మాత్రం సూత్రప్రాయంగా తెలిపారు. సో. వీరిద్దరినీ కలిపితే నిజంగానే క్రేజీ ప్రాజెక్ట్‌ ఖ్వుతుంది.  ఇంతవరకు తెలుగులో రాని సినిమాల స్థాయిలో సినిమా వుంటుందని సమాచారం.