ఆదివారం, 29 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : గురువారం, 13 ఏప్రియల్ 2023 (11:57 IST)

నాని దసరా సినిమాకు ఫిదా అయిన చిరంజీవి

chiru-nani
chiru-nani
హీరో నాని నటించిన దసరా సినిమా అన్ని భాషల్లో విడుదలైంది. మొత్తంగా  వందకోట్ల క్లబ్‌లో చేరింది. కాగా, ఈ సినిమాను మెగాస్టార్‌ చిరంజీవి తిలకించారు. వెంటనే నానికి శుభాకాంక్షలు తెలుపూ ట్విట్టర్‌లో పోస్ట్‌చేశారు. డియర్‌ నాని, కంగ్రాట్యులేషన్స్‌. నేను దసరా సినిమా చూశాను. చాలా బ్రిలియంట్‌ సినిమా. మేకోవర్‌లోనూ, పెర్‌ఫార్మెన్స్‌లోనూ చింపేశావంతే.
 
ఇలాంటి అద్భుతమైన ఐడియా వచ్చిన దర్శకుడు శ్రీకాంత్‌ ఓదెలను అభినందిస్తున్నా. సార్ట్‌ కాస్ట్‌ పర్‌ఫెక్ట్‌గా తీసుకున్నాడు. మన మహానటి కీర్తిసురేష్‌ తన నటనతో వావ్‌! అనిపించింది. యంగ్‌ నటుడు దీక్షిత్‌ కూడా బాగా చేశాడు. సంతోష్‌ నారాయణ సంగీతం హైలైట్‌ అయింది. మీ ఎంటైర్‌ టీమ్‌కూ శుభాకాంక్షలు అని తెలిపారు. ఇందుకు నాని చాలా థ్యాంక్స్‌ మెగాస్టార్‌ గారు మీనుంచే మాస్‌ సినిమాలకు స్పూర్తి అంటూ సింపుల్‌గా బదులిచ్చారు.